NTV Telugu Site icon

Kolkata Rape Case CBI: సంజయ్‌ రాయ్‌కు బెయిల్‌ ఇవ్వమంటారా? సీబీఐపై కోర్ట్ సీరియస్..!

Sanjay

Sanjay

Kolkata Rape Case CBI: కోల్‌కతా ఆర్జీ కర్‌ ఆస్పత్రిలో జూనియర్‌ వైద్యురాలి హత్యాచార, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌ను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఈ కమ్రంలో సంజయ​ బెయిల్‌ కోరుతూ కోల్‌కతా సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు అయింది. ఈ పిటిషన్‌పై విచారణ చేసిన న్యాయస్థానం సీబీఐపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

Read Also: RG Kar Ex-Principal: ఈడీ సోదాల్లో వెలుగులోకి సందీప్‌ ఘోష్‌ లగ్జరీ బంగ్లా.. కీలక పత్రాలు స్వాధీనం..!

కాగా, శుక్రవారం సాయంత్రం 4.20 గంటలకు కోల్ కతా కోర్టులో వాదనలు కొనసాగాయి. నిందితుడి తరఫున లాయర్ కవితా సర్కార్‌ వాదనలు వినిపించింది. అనంతరం వాదనలు వినిపించాలని సీబీఐ తరఫున న్యాయవాదిని కోర్టు కోరింది. కానీ, సీబీఐ న్యాయవాది దీపక్ పోరియా అందుబాటులో లేకపోవటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది న్యాయస్థానం. దీంతో.. ‘నిందితుడు సంజయ్‌ రాయ్‌కు బెయిల్‌ ఇవ్వమంటారా? లాయర్ కోర్టు హాలులో లేకపోవటం సీబీఐ చట్టవ్యతిరేక ప్రవర్తనకు నిదర్శనం.. ఇలా చేయటం దురదృష్టకరం అంటూ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పమేలా గుప్తా సీబీఐపై మండిపడింది.

Read Also: CM Revanth Reddy: ఖైరతాబాద్‌ మహాగణపతికి సీఎం రేవంత్ రెడ్డి తొలిపూజ..

అయితే, సుమారు 40 నిమిషాల ఆలస్యం తర్వాత సీబీఐ తరఫున లాయర్ కోర్టుకు హాజరై తన వాదనలు వినిపించారు. నిందితుడు సంజయ్ రాయ్ బెయిల్ అభ్యర్థనను తీవ్రంగా వ్యతిరేకించారు. సున్నితమైన ఈ కేసులో సీబీఐ చేసే విచారణకు ఆటంకం కలిగిస్తుందని న్యాయస్థానికి తెలియజేశారు. వాదనలు విన్న కోర్టు సంజయ్‌ రాయ్‌ బెయిల్‌ పటిషన్‌ ను తిరస్కరించింది. ఈ కేసులో నిందితుడు సంజయ్‌ రాయ్‌ను పోలీసులు ఆగస్టు 10న అరెస్ట్‌ చేయగా.. కోర్టు నిందితుడికి సెప్టెంబర్‌ 20 వరకు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి ఇచ్చింది. సీబీఐ విచారణలో భాగంగా నిందితుడుకి గత నెలలో పాలిగ్రాఫ్‌ టెస్ట్ నిర్వహించారు.