ముంబైలో శనివారం అంతర్జాతీయ పాప్ స్టార్ దువా లిపా, ప్లేబ్యాక్ సింగర్ జోనితా గాంధీ సంగీత కచేరీ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ చుట్టూ ఉన్న రహదారులను శనివారం మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. భరత్ నగర్ జంక్షన్ నుంచి కుర్లా వైపు వాహనాలను అనుమతించబోమని ముంబై ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. బాంద్రాలోని ఖేర్వాడి గవర్నమెంట్ కాలనీ నుంచి యూటీఐ టవర్స్ వైపు వెళ్లే రహదారిని మూసేశారు.
సంగీత కచేరీకి భారీ సంఖ్యలో ప్రజలు రానున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు కచేరీ ప్రారంభం కానుంది. భారీ ఇబ్బందులు తలెత్తనున్న నేపథ్యంలో ముంబైలో సగం దారులు మూసేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
దువా లిపా ఇంగ్లీష్ మరియు అల్బేనియన్ గాయని, పాటల రచయిత. ఏడు బ్రిట్ అవార్డులు అందుకుంది. మూడు గ్రామీ అవార్డులు దక్కించుకుంది. టైమ్ మ్యాగజైన్ 2024లో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో ఆమె స్థానం సంపాదించుకుంది. 2014లో సంగీతంలోకి ప్రవేశించే ముందు మోడల్‌గా పనిచేసింది.