NTV Telugu Site icon

Gurpatwant Pannun: ఖలిస్తానీ వేర్పాటువాది పన్నూ మిస్సింగ్.. లేపేస్తారనే భయంతో అజ్ఞాతంలోకి..

Gurpatwant Pannun

Gurpatwant Pannun

Gurpatwant Pannun: ఖలిస్తానీ వేర్పాటువాదుల్లో భయం పట్టింది. 45 రోజలు వ్యవధిలో ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు వివిధ ప్రాంతాల్లో హతమయ్యారు. దీంతో మిగతా ఖలిస్తానీ వేర్పాటువాదులు గత కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదు. ఖలిస్తానీల్లో కీలకమైన గురుపత్వంత్ సింగ్ పన్నూ గత కొంతకాలంగా కనిపించడం లేదు. బ్రిటన్, యూఎస్, కెనడా కేంద్రంగా ఖలిస్తానీ వేర్పాటువాదానికి సహకరిస్తున్న పన్నూ..భారత విద్వేషాన్ని నరనరాల నింపుకున్నారు. ‘సిక్ ఫర్ జస్టిస్’ సంస్థ పేరుతో భారత్ లో విద్వేషాన్ని పెంపొందించేందుకు ప్రయత్నించాడు. 2020లో భారత ప్రభుత్వం ఇతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది.

Read Also: PM Modi: మోడీ క్రేజ్ మామూలుగా లేదుగా.. సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌ల కోసం క్యూ కట్టిన యూఎస్ చట్టసభ సభ్యులు

గతంలో ప్రధాని నరేంద్రమోడీతో పాటు బీజేపీ, ఆర్ఎస్ఎస్ వ్యక్తులకు వార్నింగ్ ఇచ్చాడు. ఏప్రిల్ నెలలో ప్రధాని ఈశాన్య రాష్ట్రాల పర్యటనకు ముందు పన్నూ ప్రధానిని బెదిరిస్తూ అస్సాం జర్నలిస్టులకు ఆడియో సందేశాన్ని పంపాడు. దీంతో అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. చాలా సార్లు పంజాబ్ ను భారత్ నుంచి విడగొడతామని ప్రగల్భాలు పలికాడు. అయితే గత కొంత కాలంగా ఆయన మిస్సింగ్. అతని ఆచూకీ లభించడం లేదు.

45 రోజుల్లో ముగ్గుర కీలక ఖలిస్తానీ ఉగ్రవాదలు అనుమానాస్పదంగా మరణించారు. ఈ వారంలో కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ (45)ని కెనడాలోని సర్రే పట్టణంలో గురుద్వారాకు సమీపంలో ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు. అంతకుముందు బ్రిటన్ లో భారతరాయబార కార్యాలయంపై దాడికి పాల్పడిన అవతార్ సింగ్ ఖాండా అనే ఉగ్రవాది అనుమానాస్పద రీతిలో మరణించాడు. ఈ ఘటనకు ముందు పాకిస్తాన్ లాహోర్ లో ఉంటున్న ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ కీలక నేత, వాంటెడ్ ఖలిస్థానీ ఉగ్రవాది పరమ్‌జిత్ సింగ్ పంజ్వార్ (63)ను మే 6న లాహోర్‌లో గుర్తు తెలియని సాయుధుడు కాల్చిచంపాడు. దీంతో వరస ఘటనల నేపథ్యంలో పలువురు కీలక నేతలు అండర్ గ్రౌండ్ కు వెళ్లారని తెలుస్తోంది. అయితే ఈ హత్యలు ఎవరు చేస్తున్నారనేది ఇంకా వీడని ప్రశ్నగా ఉంది. అయితే పలువురు ఖలిస్తానీవాదులు మాత్రం ఈ హత్యల వెనక భారత్ ఉందని ఆరోపణలు గుప్పిస్తున్నారు.