Site icon NTV Telugu

Mangaluru Murder: సంచలనంగా మంగళూర్ హత్య.. కాంగ్రెస్‌కి ముస్లిం కార్యకర్తల సామూహిక రాజీనామా..

Congress

Congress

Mangaluru Murder: కర్ణాటక కోస్తా ప్రాంతంలో జరుగుతున్న హత్యలు ఆ రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం బజరంగ్ దళ్ మాజీ కార్యకర్త సుహాస్ శెట్టి హత్య జరిగింది. దీని తర్వాత, తాజాగా సోమవారం, బంట్వాల్ తాలూకాలోని ఇరా కోడి సమీపంలో పికప్ డ్రైవర్, కోల్తమజలు జుమ్మా మసీదు కార్యదర్శి 32 ఏళ్ల అబ్దుల్ రెహమాన్ పట్టపగలు నరికి చంపబడ్డాడు. ఈ దాడిలో అతడి సహచరుడు కలందర్ షఫీ (29) తీవ్ర గాయాలపాలయ్యారు.

Read Also: Pakistan: ‘‘అవును, భారత్ బ్రహ్మోస్‌తో మా ఎయిర్‌బేస్‌లపై దాడి చేసింది’’..ఒప్పుకున్న పాక్ ప్రధాని..

ఈ వరస హత్యల నేపథ్యంలో, ముస్లిం కమ్యూనిటీకి చెందిన వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఈ రోజు మంగళూర్‌లో సామూహిక రాజీనామా చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వీరింతా రాజీనామాలు చేశారు. మైనారిటీ ప్రయోజనాలను కాపాడటానికి, హత్యల్ని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా కృషి చేయడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. ఈరోజు తెల్లవారుజామున, మంగళూరు మాజీ మేయర్ కె. అష్రఫ్ దక్షిణ కన్నడ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్ష పదవి నుండి వైదొలిగారు, రాష్ట్రం మత హింస ,ద్వేషపూరిత నేరాలను అరికట్టడంలో విఫలమైందని ఆరోపించారు.

Exit mobile version