NTV Telugu Site icon

Assam Congress: అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడిగా గౌరవ్ గొగోయ్‌..

Gogai

Gogai

Assam Congress: వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఈశాన్య రాష్ట్రం అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడిగా లోక్‌సభ సభ్యుడు గౌరవ్ గొగోయ్‌ను నియమించాలని కోరుతూ ఆ పార్టీ సీనియర్ నాయకుల బృందం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాసింది. ఇదే విషయాన్ని ఇప్పటికే సోనియా, రాహుల్ గాంధీలతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు కూడా తెలియజేశారు. దీంతో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు సరైన సమాధానం చెప్పిది గొగోయ్ మాత్రమే అని పార్టీ శ్రేణులు సైతం భావిస్తున్నారు. కాగా, ఇటీవల గొగోయ్ భార్యకు పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నాయని సీఎం బిశ్వ శర్మ ఆరోపించగా.. అతడి వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గొగోయ్ హెచ్చరించాడు.

Read Also: Indian Flag In Pak: దెబ్బకి దిగొచ్చిన పాక్.. ఆ స్టేడియంలో భారత జాతీయ పతాకం

కాగా, తక్షణమే గౌరవ్ గొగోయ్‌ను అస్సాం కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని పార్టీ సీనియర్ నేతలు డిమాండ్ చేశారు. ఈ నిర్ణయంతో అస్సాం ప్రజలతో కనెక్ట్ అవ్వడంలో కాంగ్రెస్ గణనీయమైన పురోగతి సాధించడానికి ఎంతో సహాయ పడుతుందన్నారు. రాష్ట్రంలో కీలకమైన సామాజిక వర్గాల్లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉందని వారు చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది అస్సాంలో జరిగే ఎన్నికలకు ముందు పార్టీలో ఐక్యతా భావాన్ని పెంపొందించడంలో గొగోయ్ ఎంపిక ఎంతో సహాయపడతాయని కాంగ్రెస్ హైకమాండ్ ముందు వెల్లడించారు.

Read Also: Nedurumalli Ram Kumar Reddy: మంత్రి లోకేష్ కూడా ప్రభుత్వ బడులను చూసి ఆశ్చర్యపోయారు!

ఇక, అస్సాం పీసీసీ అధ్యక్షుడిగా బూపన్ కుమార్ బోరా దాదాపు నాలుగేళ్ల పదవీని సైతం పూర్తి చేసుకున్నారు. అయితే, లోక్‌సభలో ప్రస్తుతం కాంగ్రెస్ డిప్యూటీ లీడర్, సీబ్ల్యూసీ సభ్యుడిగా ఉన్న గౌవర్ గొగోయ్.. ఎల్‌ఓపీ నేత రాహుల్ గాంధీతో మంచి సాన్నిహిత్యం ఉంది. దీంతో గొగోయ్ ను అస్సాం రాష్ట్ర పీసీసీ చీఫ్ గా నియమించడానికి సైతం ఏఐసీసీ పెద్దలు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే, గత కొంతకాలంగా హిమంత బిశ్వశర్మ- గొగోయ్‌ల మధ్య జరిగిన వివాదంలో.. రాహుల్ గాంధీ తర్వాత శర్మకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది గొగోయ్ మాత్రమే అని చెప్పొచ్చు.