Seema Haider: భారత్-పాకిస్తాన్ “సరిహద్దు”పై ప్రశ్న..స్టూడెంట్ ఏం రాశాడో తెలుసా..? చూస్తే నవ్వు ఆపుకోలేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Seema Haider: భారత్-పాకిస్తాన్ సరిహద్దుకు సంబంధించి పరీక్షలో ప్రశ్న అడగడం, దీనికి ఓ విద్యార్థి రాసిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజెన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. రాజస్థాన్ ధోల్పూర్ జిల్లాలోని ఓ పాఠశాలలో పొలిటికల్ సైన్స్ పరీక్షల్లో ఓ ప్రశ్నకు విద్యార్థి రాసిన సమాధానం చూస్తే నవ్వాపుకోలేరు. అంతలా ఇంటర్నెట్‌ని ఆకట్టుకుంటుంది ఈ సమాధానం.
విషయానికి వస్తే.. పరీక్షలో ‘‘ భారత్- పాకిస్తాన్ కే బీచ్ కౌన్సీ సీమా హై, లంబే బతావో..?(భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఏ సరిహద్దు ఉంది, దాని పొడవు చెప్పండి?)’’ అనే ప్రశ్న వచ్చింది. దీనికి సదరు విద్యార్థి ఏకంగా ‘సీమ’(సరిహద్దు)ని ‘‘సీమా హైదర్’’గా పొరబడ్డాడు. ఇటీవల సీమా హైదర్ అనే యువతి తన ప్రేమికుడిని వెతుక్కుంటూ పాకిస్తాన్ నుంచి ఉత్తర్ ప్రదేశ్‌కి రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.
Also Read
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్‌లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్

Read Also: BJP: “అయోధ్య రాముడి” నినాదంతో లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ ప్లాన్..
స్టూడెంట్ భారత్-పాకిస్తాన్ మధ్య సీమ(సరిహద్దు) సీమా హైదర్ అని, ఆమె ఎత్తు 5 అడుగుల 6 అంగుళాలను రెండు దేశాల మధ్య దూరంగా రాశాడు. దీంతో ఒక్కసారిగా ఈ సమాధానం వైరల్ అవుతోంది. ఈ సమాధానం చూసి పడిపడి నవ్వుకుంటున్నారు. ”దోనో దేశోం కే బీచ్ సీమా హైదర్ హై. ఉస్కీ లంబై 5 అడుగుల 6 అంగుళాల హై. దోనో దేశోం కే బీచ్ ఇస్కో లేకర్ లడాయి హై (సీమా హైదర్ రెండు దేశాల మధ్య ఉంది. ఆమె 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు. ఆమె కారణంగా దేశాలు పోరాడుతున్నాయి)’’ అని సమాధానం రాశాడు.
దీనిపై నెటిజన్లు ఫన్నీగా రిఫ్లై ఇస్తున్నారు. వాట్సాప్ యూనివర్సిటీ విద్యార్థి ఒకరు కామెంట్ చేయగా.. ఇంకొకరు ‘ అతను రాసిన వినూత్న సమాధానికి అదనపు మార్కులు ఇవ్వాలి’ అని, మరొకరు ‘ విద్యార్థి ఇరు దేశాల మధ్య అంతరాన్ని తగ్గించాడు, అతన్ని సస్పెండ్ చేయరని ఆశిస్తున్నా’ అంటూ రిఫ్లై ఇచ్చారు.
ఈ ఏడాది పాకిస్తాన్‌కి చెందిన సీమా హైదర్ అనే యువతి భారత్ లోని సచిన్ మీనా కోసం తన పిల్లలతో సహా భారత్ వచ్చింది. పబ్జీ గేమ్‌తో ఇద్దరు కలిశారు. 2019లో వీరి పరిచయం జరిగింది. ఆ తర్వాత ఈ ఏడాది తన నలుగురి పిల్లలతో నేపాల్ ద్వారా ఇండియాలోకి వచ్చింది. ప్రస్తుతం సీమా హైదర్, సచిన్ మీనా సహజీవనం చేస్తున్నారు.
Question – Bharat aur Pakistan ke bich kaun si seema hai, lambai batao?
Answer – Dono desho ke bich Seema Haider hai, uski lambai 5 ft 6 inch hai, dono desho ke bich isko lekar ladai hai. pic.twitter.com/25d5AvUlwl
— Narundar (@NarundarM) December 21, 2023
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!