Site icon NTV Telugu

Amit Shah Convoy: అమిత్‌ షా కాన్వాయ్‌కు అడ్డుగా వచ్చిన కారు.. అద్దాలు పగులగొట్టిన ఎస్పీజీ

Amitshah Convoy

Amitshah Convoy

Amit Shah Convoy: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌ పర్యటనలో భద్రతా లోపం తలెత్తింది. హరిత ప్లాజా ఎంట్రీ పాయింట్ వద్ద అమిత్ షా కాన్వాయ్‌కి ఓ కారు అడ్డొచ్చింది. కారు పక్కకి తీయకపోవడంతో అమిత్ షా భద్రతా సిబ్బంది కారు వెనక అద్దం పగలగొట్టారు. కాగా సెక్యూరిటీ బ్రీచ్‌ గురించి తెలిసిన వెంటనే స్పెషల్ బ్రాంచ్ అధికారులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. కాన్వాయ్‌కి అడ్డుగా వచ్చిన కారు వివరాలు తెలుసుకున్నారు. కేంద్ర హోమంత్రి కాన్వాయ్‌కి కారు అడ్డుగా రావడంపై స్థానిక ట్రాఫిక్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు కారు అడ్డుగా వచ్చింది, ఆ కారులో ఉన్న వ్యక్తి వంటి వివరాలను ట్రాఫిక్ పోలీసుల నుంచి స్పెషల్ బ్రాంచ్ అధికారులు తెలుసుకున్నారు. ఈ ఘటనతో దాదాపు 5 నిమిషాల పాటు అమిత్‌ షా కాన్వాయ్ హరిత ప్లాజా ముందు ఆగిపోయింది. అయితే టెన్షన్‌లో అలా జరిగిపోయింది అని ఆ కారులోని వ్యక్తి చెబుతున్నాడు.

PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

హోంమంత్రి అమిత్ షా కాన్వాయ్‌కి అడ్డుగా వచ్చిన రెడ్ కలర్ కారును పోలీసులు గుర్తించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ కారుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. భద్రత వైఫల్యం జరిగిందని కేంద్ర నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. ఎక్కడ ఏమి జరిగిందని హరితా ప్లాజా దగ్గర ఆరా తీస్తున్నారు.

Exit mobile version