పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య పెరుగుతోంది. ఇదిలా ఉంటే మరో కొత్త వ్యాధి బెంగాల్ ను ఆందోళన పరుస్తోంది. రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా కోల్‌కతా నగరంలో స్క్రబ్ టైఫస్ కేసులు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారుల్లో బ్యాక్టీరియా వల్ల ఈ ఇన్ఫెక్షన్లు కలుగుతుంది. ఇప్పటి వరకు బెంగాల్ వ్యాప్తంగా 10 మంది పిల్లలు ఈ వ్యాధి బారిన పడ్దారు. వీరందరికి చికిత్స అందిస్తున్నారు. దీంతో బెంగాల్ లో మమతా సర్కార్ అప్రమత్తం అయింది. వ్యాధి నిర్థారణ కోరొకు వెంటనే ఐజీఎం కిట్లను కొనుగోలు చేయాలని ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 44 ప్రభుత్వ ఆసుపత్రులకు ఈ కిట్లను పంపించాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది.
స్క్రబ్ టైఫస్ ట్రోంబికుల్లిస్ మైట్స్ అనే కీలకాల ద్వారా వస్తుంది. ఈ కీటకాలు కుట్టినప్పుడు స్క్రబ్ టైఫస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. వ్యాధిని ముందుగా గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. అయితే ఆలస్యం అయితే ప్రాణాపాయం తప్పదని వైద్యులు చెబుతున్నారు. జ్వరంతో పాటు తలనొప్పి, లో బీపీ, జలుబు, కడుపులో సమస్యలు, చేతుల నొప్పి, కీటకం కుట్టిన చోట మచ్చలు ఏర్పడటం ఈ వ్యాధి లక్షణాలు. రోగ నిర్థారణ ఆలస్యం అయినప్పుడు స్క్రబ్ టైఫస్ ప్రాణాంతకం అవుతుంది.
Read Also: Irfan Pathan: కోహ్లి, రోహిత్‌లను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే స్క్రబ్ టైఫస్ తో పాటు పశ్చిమ బెంగాల్ ఉత్తర భాగంలో నైరోబీ ఫ్లై హడలుపుట్టిస్తోంది. ముఖ్యంగా సిరిగురి నగరంలో పలువురు ప్రజలు నైరోబీ ఈగల వల్ల ప్రభావితం అయ్యారు. ఇప్పటికే సిక్కింతో వందకు పైగా ప్రజలు ఈ నైరోబీ ఈగలు వాలడం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్లకు గురయ్యారు. బెంగాల్ లోని కొన్ని ప్రాంతాల్లో కూడా నైరోబీ ఫ్లైతో ప్రభావితం అవుతున్నాయి.