Karnataka: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారి ఒకరు కస్టమర్‌తో సంభాషిస్తున్న సమయంలో కన్నడ మాట్లాడటానికి నిరాకరించడంతో కర్ణాటకలో వివాదానికి దారి తీసింది. ప్రజల నుండి తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ ఘటన అనేకల్ తాలూకాలోని సూర్య నగర్ బ్యాంక్ బ్రాంచ్‌లో జరిగింది. అయితే, బ్యాంకుకు వెళ్లిన ఓ కస్టమర్ స్థానిక భాష మాట్లాడటంతో బ్యాంకు సిబ్బంది గొడవకు దిగింది.
Read Also: Rains: బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
అయితే, ఆ వీడియోలో కన్నడ మాట్లాడున్న కస్టమర్ ఎవరు అని ఆ బ్యాంకు ఉద్యోగి అడుగుతున్నట్లు మనం చూడొచ్చు. దీంతో స్థానిక భాషలో మాట్లాడాలని బ్యాంకు ఎంప్లాయీని అతడు కోరాడు. ఇక, కన్నడ మాట్లాడటం తప్పనిసరి చేసే ఏదైనా నియమం ఉందా అని కస్టమర్ ను ప్రశ్నించింది. పదే పదే ఆ అధికారిని కన్నడ మాట్లాడమని చెప్పడంతో విసుగు చెందిన ఆ ఉద్యోగి నేను ఎప్పటికీ కన్నడ మాట్లాడను అని ప్రకటిస్తూ వెళ్ళిపోయింది. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అలాగే, ఈ వీడియోను SBI, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లను ట్యాగ్ చేస్తూ, తమ సిబ్బందితో కస్టమర్లపై బలవంతంగా హిందీని రుద్దుతున్నారని రాసుకొచ్చాడు.
Read Also: US: అత్యంత శక్తివంతమైన గోల్డెన్ డోమ్ వ్యవస్థను పరిచయం చేసిన ట్రంప్
ఇక, ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక బహిరంగ ప్రకటన విడుదల చేసింది. బెంగళూరులోని AO సౌత్‌లోని మా సూర్య నగర్ బ్రాంచ్‌లో ఇటీవల జరిగిన సంఘటనపై మేము తీవ్ర ఆందోళన చెందుతున్నాం.. ఈ విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని బ్యాంక్ తెలిపింది. కస్టమర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేసేలా ప్రవర్తించిన వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటుందని పేర్కొనింది. కస్టమర్లను గౌరవించడం తమ మొదటి ప్రయార్టీ అని ఎస్బీఐ చెప్పుకొచ్చింది.
