Site icon NTV Telugu

Tejashwi Yadav Vs BJP: తేజస్వి యాదవ్‌పై సతీష్ కుమార్ పోటీ.. బ్యాగ్రౌండ్ ఇదే!

Bihar Elections 2025

Bihar Elections 2025

బీహార్‌లో బీజేపీ చాలా దూకుడుగా కనిపిస్తోంది. బీజేపీ పూర్తిగా తన అభ్యర్థులను ప్రకటించేసింది. మూడు విడతల్లో 101 మంది అభ్యర్థులను వెల్లడించింది. ఇక ప్రతిపక్షం నుంచి ముఖ్యమంత్రి రేసులో ఉన్న తేజస్వి యాదవ్ పోటీ చేస్తున్న రఘోపూర్ నుంచి సతీష్ కుమార్ యాదవ్‌ను బీజేపీ రంగంలోకి దింపింది.

సతీష్ కుమార్ యాదవ్‌..
సతీష్ కుమార్ యాదవ్‌ ఆర్జేడీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. అనంతరం 2005లో జేడీయూలో చేరారు. 2005లో రఘోపూర్‌లో రబ్రీ దేవిపై పోటీ చేసి సతీష్ కుమార్ యాదవ్ ఓటమి పాలయ్యారు. కానీ 2010లో మాత్రం రబ్రీదేవిని 13,06 ఓట్ల తేడాతో సతీష్ కుమార్ యాదవ్ ఓడించారు. ఈ ఎన్నికల్లో సతీష్‌కు 64, 222 ఓట్లు రాగా.. రబ్రీదేవికి 51, 216 ఓట్లు వచ్చాయి. తిరిగి 2015లో తేజస్వి యాదవ్‌పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

ఇది కూడా చదవండి: Modi Trump Meeting: రష్యా నుండి చమురు కొనుగోలు ఆపబోతున్న భారత్.. ట్రంప్ ఏమన్నారంటే?

రఘోపూర్ నియోజకవర్గం వైశాలి జిల్లాలో ఉంది. ఈ రఘోపూర్ నియోజకవర్గం రాష్ట్రానికి ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులను అందించిన నియోజకవర్గం. లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి ఈ నియోజకవర్గం కంచుకోట లాంటింది. లాలూ ప్రసాద్ యాదవ్ 1995, 2000 సంవత్సరాల్లో రెండు సార్లు గెలిచారు. ఇక ఆయన భార్య రబ్రీ దేవి మూడు సార్లు విజయం సాధించారు. ఇక వారి కుమారుడు తేజస్వి యాదవ్ 2015, 2020లో రెండు సార్లు గెలుపొందారు. తాజాగా మరోసారి ఇక్కడ నుంచి గెలుపొంది హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు.
రఘోపూర్‌లో 31 శాతం యాదవ్ కులస్థులు ఉంటారు.

ఇది కూడా చదవండి: Radhika Apte : హీరోల కోసమే సినిమాలు చేస్తారా.. రాధిక ఆప్టే ఫైర్

ఎన్డీఏ కూటమిలో బీజేపీ-జేడీయూ చెరో 101 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. మంగళవారం 71 మందితో తొలి జాబితా విడుదల చేయగా.. ఇక బుధవారం ఉదయం 12 మందితో రెండు జాబితా, రాత్రి 18 మందితో మూడో జాబితాను విడుదల చేసింది. 101 అభ్యర్థుల్లో 16 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించింది. 243 స్థానాలకు రెండు దశలుగా జరిగే బీహార్ ఎన్నికలకు 101 మంది అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించింది. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి.

Exit mobile version