NTV Telugu Site icon

Dalbir Kaur: సరబ్ జిత్ సింగ్ సోదరి కన్నుమూత..పాకిస్తాన్ ప్రభుత్వంతో సుదీర్ఘ పోరాటం

Dalbir Kaur, Sarabjit

Dalbir Kaur, Sarabjit

సరబ్ జీత్ సింగ్ సోదరి దల్బీర్ కౌర్ మరణించారు. పంజాబ్ లోని భిఖివింద్ లో ఆమె అంత్యక్రియలను ఆదివారం నిర్వహించారు. తన సోదరుడు సరబ్ జీత్ సింగ్ ను పాకిస్తాన్ చెర నుంచి విడిపించేందుకు సుదీర్ఘ కాలం పాటు పాకిస్తాన్ ప్రభుత్వంతో పోరాడింది. అయినా పాకిస్తాన్ ప్రభుత్వం సరబ్ జిత్ సింగ్ ను వదిలిపెట్టలేదు. చివరకు అక్కడే మరణించారు. ఈమె కథ ఆధారంగా ఐశ్వర్య రాయ్ లీడ్ రోల్ లో ‘సరబ్ జిత్’ సినిమాను రూపొందించారు. తన సోదరుడిని పాక్ జైలు నుంచి విడిపించాలని భారత ప్రభుత్వాన్ని పలుమార్లు కోరింది.

పంజాబ్ సరిహద్దుల్లో ఉండే గ్రామంలో నివసించే సరబ్ జీత్, మద్యం సేవించిన తర్వాత భారత్ సరిహద్దు క్రాస్ చేసి పాకిస్తాన్ లోకి వెళ్లాడు. అక్కడ బలగాలు అతన్ని అరెస్ట్ చేశాయి. ఈ ఘటన 1991లో జరిగింది. సరబ్ జీత్ పై గూఢచర్యం నేరాన్ని మోపి  పాక్ ప్రభుత్వం మరణశిక్ష విధించింది.

సరబ్ జిత్ ను 22 ఏళ్ల పాలు లాహెర్ లోని కోట్ లఖ్పత్ జైలులో ఉంచారు. 2013లో తోటి ఖైదీలు సరబ్ జిత్ పై జైలులో తీవ్రంగా దాడి చేయడంతో తలకు బలమైన గాయాలు కావడం వల్ల  ఐదు రోజులు లాహెర్ లోని జిన్నా హస్పిటల్ లో కోమాలో ఉండి మరణించారు. భారత ప్రభుత్వం చాలా సార్లు అతడు గూఢాచారి కాదని పాక్ ప్రభుత్వానికి తెలిపినా.. అక్కడి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. సరబ్ జిత్ అక్క దల్బీర్ కౌర్ 22 ఏళ్ల పాటు తమ్ముడి విడుదల కోసం పోరాడింది.

సరబ్ జిత్ మరణంపై భారత విదేశాంగ శాఖ విచారణ జరపాలని పాక్ ప్రభుత్వాన్ని కోరింది. అయితే దల్బీర్ కౌర్ కూడా సరబ్ జిత్ మరణంపై పాక్ విచారణ చేయాలని.. ఒక వేళ ప్రభుత్వమే ప్లాన్ చేసి ఉంటే విచారణ అవసరం లేదని.. అధికారులకు తెలియకుండా సరబ్ జీత్ ను చంపితే మాత్రం ఖచ్చితంగా విచారణ చేయాలని పాక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.