Site icon NTV Telugu

Sanjay Raut: ప్రధాని మోడీ చూస్తే యుద్ధం చేసేలా కనిపించడం లేదు..

Modi

Modi

Sanjay Raut: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో శివసేన (ఠాక్రే) నేత సంజయ్ రౌత్ ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ బాడీ లాంగ్వేజ్ చూస్తే ఆయన పాకిస్తాన్‌తో యుద్ధం చేసేలా లేరని అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ కాశ్మీర్‌లో పెద్ద ఊచకోత జరిగింది. మన ప్రధాన మంత్రి పాకిస్తాన్‌కి గుణపాఠం నేర్పుతామని చెప్పారు. కానీ కొద్ది రోజుల తర్వాత, మోడీ ముంబైలో బాలీవుడ్ ప్రముఖలతో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన బీహార్‌లో ప్రచారం చేసి గౌతమ్ అదానీ పోర్టు ప్రారంభోత్సవం కోసం కేరళ వెళ్లారు’’ అని అన్నారు.

Read Also: Pakistan: బలూచిస్తాన్‌లో ముగిసిన పాక్ ఆట.. బీఎల్ఏ ఆధీనంలో పట్టణాలు, ప్రభుత్వ భవనాలు..

ప్రధాని మోడీ బాడీ లాంగ్వేజ్ చూస్తే పాకిస్తాన్‌పై కఠినంగా స్పందించే వ్యక్తిలా కనిపించడం లేదని సంజయ్ రౌత్ ఆరోపించారు. పాకిస్తాన్‌తో ఎలా స్పందించాలో అని మేమంతా ఆందోళన చెందుతుంటే, మోడీ మాత్రం ఉల్లాసంగా ఉన్నారని ఆయన అన్నారు. దేశంలో జరుగుతున్న యుద్ధ విన్యాసాలు, సాధారణంగా ఎప్పుడూ జరిగేవే అని అన్నారు.

ఇదే సమయంలో, బీజేపీ యుద్ధ భాష మాట్లాడుతోందని చెప్పారు. రక్షణ మంత్రి పాకిస్తాన్‌ని తుడిచిపెడుతామని చెబుతున్నారు, హోం మంత్రి అమిత్ షా ఉగ్రవాదుల్ని వదిలిపెట్టమని చెబుతున్నారు, మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు..? అని ప్రశ్నించారు. గత 10 ఏళ్లలో కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి అమిత్ షా బాధ్యత వహించి, రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒక వేళ పార్లమెంట్‌లో చర్చ జరిగినా, పహల్గామ్ దాడిపై మాట్లాడేందుకు ప్రభుత్వం ప్రతిపక్షాలను అనుమతించదని అన్నారు.

Exit mobile version