Sanjay Raut comments on Rahul Gandhi and BJP: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నాయకత్వానికి గతేడాది కొత్త ఊపు వచ్చిందని.. ఇది 2023లో కూడా ఇదే విధంగా కొనసాగితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో రాజకీయ మార్పును చూడవచ్చని శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నేత సంజయ్ రౌత్ ఆదివారం పేర్కొన్నారు. శివసేన పార్టీ పత్రిక ‘సామ్నా’లో రోఖ్‌థోక్ కాలంలో సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు దేశంలో ద్వేషం, విభజన విత్తనాలు నాటవద్దని అన్నారు.
Read Also: Gas Cylinder Price: న్యూ ఇయర్ వేళ బాంబ్ పేల్చిన కేంద్రం.. గ్యాస్ సిలిండర్ ధర పెంపు
ప్రస్తుతం రామమందిర సమస్య పరిష్కారమైందని కాబట్టి ఈ అంశంపై ఒట్లు అడగలేవని రౌత్ సామ్నాలో పేర్కొన్నారు. అందుకే కొత్తగా ‘లవ్ జిహాద్’ అనే దాన్ని వెతుకుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో గెలవడానికి హిందువుల్లో భయాన్ని సృష్టించడానికి ఈ లవ్ జిహాద్ ను ఉపయోగిస్తారా..? అని బీజేపీని ప్రశ్నించారు. గత నెలలో జరిగిన నటి తునీషా శర్మ, శ్రద్ధా వాకర్ కేసులను ప్రస్తావిస్తూ.. ఇవి లవ్ జిహద్ కేసులు కాదని అన్నారు. అయితే ఏ మతానికి చెందిన ఏ స్రీ కూడా అఘాయిత్యాలకు గురికావద్దని అన్నారు.
2023లో దేశంలో భయం లేకుండా ఉంటుందని తాను ఆశిస్తున్నట్లు రౌత్ అన్నారు. ప్రస్తుతం జరుగుతున్నది అంతా అధికార రాజకీయం అని ఆరోపించారు. రాహుల్ గాంధీ యాత్ర విజయవంతం అయి లక్ష్యం నెరవేరుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. 2022లో రాహల్ గాంధీ నాయకత్వానికి కొత్త శోభ వచ్చిందని.. ఇది 2023లో కొనసాగితే మార్పును చూడగలం అని అన్నారు. ప్రధాని మోదీ సంకుచిత వైఖరి విడనాడాలని ప్రధాని మోదీ చెబుతున్నారని.. కానీ వాస్తవం ఏంటంటే బీజేపీ వైఖరిలోనే ఇది ఉందని విమర్శించారు. నేటి పాలకులు ప్రతిపక్ష పార్టీల ఉనికిని, హక్కులను గుర్తించడం లేదని అన్నారు. హిందూ ముస్లింల మధ్య విభేదాలు సృష్టించడం కొత్త విజభనకు దారి తీస్తుందని హెచ్చరించారు. మోదీ, షాలు ద్వేషం, విభజన బీజం నాటకూడదని హితవు పలికారు.
