Sanjay Raut: ఇండియాలో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ జరుగుతోంది. అయితే పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఘనస్వాగతం పలకడం పలువురు ఇండియన్ ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. ఈ విజయంపై ఇటీవల బీసీసీఐని నెటిజన్లు ట్రోల్ చేశారు. తాజాగా శివసేన(ఉద్దవ్ ఠాక్రే) ఎంపీ సంజయ్ రౌత్ కూడా ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ క్రికెట్ టీంకి ఘన స్వాగతం లభించిన దృశ్యాలు చూసి.. ‘ఇది గుజరాత్ లో మాత్రమే జరుగుతుందని’ శనివారం బీజేపీపై మండిపడ్డారు. ఒకవేళ వేరే రాష్ట్రంలో ఇలా జరిగి ఉంటే బీజేపీ గగ్గోలు పెట్టేదని ఎద్దేవా చేశారు.
శివసేన వ్యవస్థాపకులు బాలాసాహెబ్ ఠాక్రేను గుర్తు చేశారు. గతంలో ఠాక్రే పాకిస్తాన్ జట్టు ముంబైలో ఆడకుండా పిచ్ ను శివసైనికులు తవ్వేశారు. మన సైనికుల్ని, కాశ్మీరీ పండిట్లను హత్య చేస్తున్నాంటూ పాకిస్తాన్ పై విమర్శలు గుప్పించారు, వారితో క్రికెట్ మ్యాచులేంటని ప్రశ్నించారు. పాకిస్తాన్ జట్టును భారత్ కి రానివ్వబోమని ఆయన ఆ సమయంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాలాసాహెబ్ ఠాక్రే పేరుతో మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, కానీ ఆయన ఆశయాలను పాటించలేదని సంజయ్ రౌత్ విమర్శించారు. బాలాసాహెబ్ ఆశయాలకు అనుగుణంగా మహారాష్ట్రలో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, గతంలో శివసేన చీలిక నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అన్నారు.