NTV Telugu Site icon

Major Sandeep Father: మేజర్ సందీప్ బాధితుడు కాదు.. తన కర్తవ్యం నిర్వర్తించాడు..

Tahavur

Tahavur

Major Sandeep Father: ముంబైలో 2008 నవంబర్ 26 నుంచి 29 వరకు జరిగిన ఉగ్రదాడుల్లో సుమారు 166 మంది చనిపోయారు. ఈ దాడుల్లో లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులు తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌తో పాటు పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడుల్లో తహవుర్ హుస్సేన్ రాణా కీలక పాత్ర పోషించాడని ఆరోపణలు ఉన్నాయి. అయితే, కాసేపట్లో అతడ్ని అమెరికా నుంచి భారత్‌కు తీసుకు రానున్నారు.

Read Also: Ampere Reo 80: మార్కెట్ లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. తక్కువ ధర.. సూపర్ ఫీచర్లు

కాగా, ఈ దాడుల సమయంలో జాతీయ భద్రతా దళం కమాండో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందారు. అతని ధైర్యం, తెగువ, త్యాగం దేశానికి స్ఫూర్తిగా నిలిచాయని మేజర్ సందీప్ తండ్రి కె. ఉన్ని కృష్ణన్ చెప్పుకొచ్చారు. ఇక, నా కొడుకు సందీప్ 26/11 బాధితుడు కాదు, అది అతడి కర్తవ్యం అన్నారు. తహావుర్ రాణా లాంటి ఉగ్రవాదులు ఈ దాడులకు కారణం, అలాంటివారు భారత న్యాయవ్యవస్థలో శిక్షను ఎదుర్కోవాలి, న్యాయం కోసం ఎదురు చూస్తున్నాను.. బాధితులందరికీ ఇది ఒక ఆశా కిరణం అని పేర్కొన్నారు. ఉగ్రవాది తహావుర్ రాణాను భారత్‌కు అప్పగించడంతో.. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థలతో పాటు 26/11 దాడులకుసంబంధించి అతనికి ఉన్న సంబంధాలు బయటపడే ఛాన్స్ ఉంది.