ముంబైలో 2008 నవంబర్ 26 నుంచి 29 వరకు జరిగిన ఉగ్రదాడుల్లో సుమారు 166 మంది చనిపోయారు. ఈ దాడుల్లో జాతీయ భద్రతా దళం కమాండో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందారు. అతని ధైర్యం, తెగువ, త్యాగం దేశానికి స్ఫూర్తిగా నిలిచాయని మేజర్ సందీప్ తండ్రి కె. ఉన్ని కృష్ణన్ చెప్పుకొచ్చారు.
మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించగా.. మహేశ్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇక పాన్ ఇండియా మూవీగా జూన్ 3 న