Karnataka: కర్ణాటకలో గంధపు చెక్కల స్మగ్లర్లు, ఫారెస్ట్ గార్డులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్ లో ఒక స్మగ్లర్ మృతిచెందాడు. బెంగళూర్ సమీపంలోని బన్నెరఘట్ట నేషనల్ పార్కులో ఎర్రచందనం స్మగ్లర్లు, ఫారెస్టు గార్డులకు బుధవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది.
తెల్లవారుజామున పెట్రోలింగ్ చేస్తున్న ఫారెస్ట్ గార్డులకు చెట్లను నరుకుతున్న శబ్ధం వినిపించింది. దీంతో అలర్ట్ అయిన అధికారులు స్మగ్లర్లను లొంగిపోవాల్సిందిగా కోరారు. కాగా స్మగ్లర్లు దాడికి తెగబడటంతో, అధికారులు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్ లో కోలార్ జిల్లా మలూరుకు చెందిన తిమ్మప్ప (40)అనే స్మగ్లర్ మరణించాడు.
Read Also: China: చైనా మ్యాపులపై భారత్ అభ్యంతరం.. స్పందించిన డ్రాగన్ కంట్రీ..
బెంగళూర్ రూరల్ ఎస్పీ మల్లికార్జున్ బాల్డండి మాట్లాడుతూ.. స్మగ్లర్లు, ఫారెస్ట్ గార్డులపై కొడవళ్లతో దాడికి ప్రయత్నించారని, దీంతో ఆత్మరక్షణకు జరిపిన కాల్పుల్లో ఒక స్మగ్లర్ మరణించాడని, రెండో స్మగ్లర్ తప్పించుకున్నట్లు వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్ లో అటవీ సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు.
