వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌పై అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి.. బీజేపీ, కాంగ్రెస్ మాత్రమేకాదు.. మరోసారి యూపీ సీఎం పీఠాన్ని అధిరోహిస్తామంటూ ప్రజల్లోకి వెళ్తోంది సమాజ్‌వాది పార్టీ.. కానీ, ఎన్నికల ముందు.. ఎస్పీకి షాక్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ.. ఆ పార్టీకి చెందిన కీలక మహిళా నాయకురాలు రమా నిరజంన్ సహా మొత్తం నలుగురు ఎమ్మెల్సీలు.. ఎస్పీకి గుడ్‌బై చెప్పారు.. ఇవాళ బీజేపీ గూటికి చేరారు.. రమా నిరంజన్‌తోపాటు ఆమె భర్త కూడా బీజేపీలో చేరారు. ఇవాళ జరిగిన ఓ కార్యక్రమంలో యూపీ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ, కేపీ మౌర్య, యూపీ బీజేపీ చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్ సమక్షంలో బీజేపీ కండువాలు కప్పుకున్నారు.. పార్టీలో కీలక నేతలైన ఎమ్మెల్సీలు రవి శంకర్ సింగ్ పప్పు, సీపీ చాంద్, అక్షయ్ ప్రతాప్ సింగ్, రమా నిరంజన్ ఒకేసారి పార్టీని వీడడంతో సమాజ్‌వాది పార్టీకి గట్టి షాక్ తగిలినట్టు అయ్యింది.