Ayodhya gangrape: గ్యాంగ్ రేప్ కేసు రాజీ కుదుర్చుకోవాలి.. బాలిక తల్లికి డబ్బులు ఆఫర్ చేసిన సమాజ్‌వాదీ నేతలు..
- ఉత్తర్ ప్రదేశ్‌లో సంచలనంగా గ్యాంగ్ రేప్..
- నిందితుల్లో సమాజ్‌వాదీ పార్టీ నేత..
- రాజీ కుదుర్చుకునేందుకు బాలిక తల్లికి డబ్బులు ఆఫర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya gangrape: ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో 12 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ అంశం సంచలనంగా మారింది. అయోధ్యలో జరిగిన ఈ ఘటనపై ఇప్పటికే యోగి సర్కార్ చర్యలు ప్రారంభించింది. అయోధ్య జిల్లాలోని భదర్సా నగర్లో ఖాన్ బేకరీ యజమాని, స్థానిక సమాజ్‌వాదీ పార్టీ నేత అయిన మోయిద్ ఖాన్, అతడి ఉద్యోగి రాజు ఖాన్ ఇద్దరు అందులో పనిచేస్తున్న 12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెకు గర్భం రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో యోగి సర్కార్ నిందితుల బేకరీని బుల్డోజర్లతో కూల్చివేసింది. ఈ కేసులో బాధితురాలిని సీఎం యోగి నేరుగా కలుసుకుని న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
Read Also: Ayodhya Rape Case: 12 ఏళ్ల బాలిక కడుపులో 12 వారాల పాప..నిందితుడి ఇంటికి బుల్డోజర్!
Also Read
- Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
- Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
- Jantar mantar: దేశ రాజధాని స్తంభించబోతోందా?
- Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
ఇదిలా ఉంటే, అత్యాచార విషయాన్ని దాచి ఉంచేందుకు సమాజ్‌వాదీ పార్టీకి చెందిన పలువురు నేతలు తమకు డబ్బు ఆశ చూపించినట్లుగా బాధితురాలి తల్లి చెప్పింది. భదర్సనగర్ పంచాయతీ చైర్మన్‌గా ఉన్న ఎస్పీ నేత మహ్మద్ రషీద్ తనకు డబ్బు ఆఫర్ చేసి, కేసులో రాజీ కుదుర్చుకోవాలని కోరినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్ర పోలీసు అధికారులు హామీ ఇచ్చారని ఆమె తెలిపారు. తమకు ఆర్థిక సాయం అందించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరింది.
రెండు నెలల క్రితం బాలికపై మోయిద్ ఖాన్, రాజుఖాన్ లు అత్యాచారానికి పాల్పడ్డారు. వైద్య పరీక్షల్లో బాలిక గర్భవతి అని తేలింది. నిందితుడు మొయిద్ ఖాన్, ఇటీవల అయోధ్య రామాయలం ఉన్న ఫైజాబాద్ నుంచి గెలిచిన ఎస్పీ నేత అవధేశ్ ప్రసాద్ టీంలో భాగమని బీజేపీతో పాటు సీఎం యోగి ఆరోపించారు. అయితే, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈ కేసులో నిందితులకు దూరంగా ఉన్నారు. మరోవైపు నిందితులకు డీఎన్ఏ టెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేయడంపై అధికార బీజేపీతో పాటు మాయావతి బీఎస్పీ పార్టీ ఫైర్ అవుతోంది.
తాజావార్తలు
-
Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
-
Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
-
iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!