మనం షెలూన్ కి వెళితే కటింగ్ పూర్తయ్యేంత వరకు డబ్బులు ఇవ్వం ఇది రూల్.. ఎక్కడైనా ఇదే ఫాలోఅవుతాం. కానీ ఓ షెలూన్ యజమాని చేసిన నిర్వాకానికి రెండు ప్రాణాలు బలయయ్యాయి. సెలూన్‌లో సగం షేవ్ చేసిన తర్వాత షేవింగ్‌కు డబ్బు చెల్లించాలని సెలూన్ నిర్వాహకుడు కష్టమర్ ను వత్తిడి చేశాడు. దీంతో కస్టమర్ మధ్య వాగ్వాదం జరిగింది. వాగ్వాదం తోపులాటగా మారడంతో సెలూన్ నిర్వాహకుడు పదునైన ఆయుధంతో కస్టమర్ గొంతు కోసి హత్య చేశాడు. ఆగ్రహించిన కుటుంబీకులు సెలూన్ యజమానిని కొట్టి చంపారు. అంతేకాదు.. సెలూన్ దుకాణం, సెలూన్ యజమాని ఇల్లు దగ్ధంచేశారు. ఈ సంఘటన మహారాష్ట్ర నాందేడ్ జిల్లా కిన్వట్ లో చోటుచేసుకుంది.
Read also: Roger Federer: టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన రాకెట్ వీరుడు.. రోజర్ ఫెదరర్
వివరాల్లోకి వెళితే.. అనిల్ మారుతి షిండే బోధి వద్ద మార్కెట్‌లో సెలూన్‌ను నడుపుతున్నాడు. అదే గ్రామంలో నివాసముంటున్న వెంకటే సురేష్ దేవ్‌కర్ అనే యువకుడు సాయంత్రం ఈ సెలూన్‌లో షేవింగ్ చేసేందుకు వెళ్లాడు. షేవింగ్ చేస్తున్నప్పుడు గడ్డం సగం వచ్చిందని దేవ్‌కర్‌కు షేవింగ్ డబ్బులు చెల్లించమని షిండే కోరగా, గడ్డం పూర్తి చేసిన తర్వాత చెల్లిస్తానని సురేష్ చెప్పాడు. దీంతో ఇద్దరిమధ్య మటలు వాగ్వాదానికి దారితీసాయి. ఆగ్రహంతో ఊగిపోయిన సెలూన్ యజమాని అనిల్ షిండే పదునైన ఆయుధంతో వెంకట్ దేవకర్‌ని గొంతు కోసాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న దేవకర్ కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని సెలూన్ షాపును తగులబెట్టారు. తరువాత షిండేను వెతికి పట్టుకుని గుమిగూడి భార్ మార్కెట్‌లో చితకబాది చంపేసారు. ఈఘటనపై స్థానిక సమాచారంతో చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
Amaravati : మోడీ శంకుస్థాపన చేశారు.. ముమ్మాటికీ అమరావతే రాజధాని..!