Salman Khan: సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు.. దమ్ముంటే వారిని రక్షించుకోవాలని వార్నింగ్
- మరోసారి సల్మాన్ ఖాన్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు..
- సల్మాన్ కు ధైర్యం ఉంటే గేయ రచయితతో పాటు మిగతా వారిని రక్షించుకోవాలని వెల్లడి..
- ఈ ఘటనసౌ వర్లీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు మరోసారి హత్య బెదిరింపులు వచ్చాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచే థ్రెట్ సందేశం వచ్చింది. ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు. బిష్ణోయ్ గ్యాంగ్ పేరును ప్రస్తావిస్తూ వచ్చిన పాటపై సల్మాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. ఈ పాట రచయిత నెలలోగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. మరోసారి పాటలు రాయలేని విధంగా లిరిసిస్ట్ పరిస్థితి ఉండబోతుందని వెల్లడించారు. సల్మాన్ ఖాన్ కు ధైర్యం ఉంటే ఆ గేయ రచయితను, మిగతా వారిని రక్షించాలని దుండగులు బెదిరింపుల మెసేజ్ లో తెలిపారు. ఈ వ్యక్తులపై వర్లీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.
Read Also: Warangal: భద్రకాళి చెరువు ఖాళీ చేసేందుకు సర్వం సిద్ధం.. అడ్డుకున్న మత్స్యకారులు..
Also Read
- Aadhaar Mobile Number Update: ఆధార్‌లో మొబైల్ నంబర్ మార్పు.. ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు? పూర్తి వివరాలు ఇవే
- BK Hariprasad: కర్ణాటక కాంగ్రెస్ పగ్గాలు ఆయనకే.. ఎవరో తెలుసా?
- Hospital Fire: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్‌లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
కాగా, సల్మాన్ ఖాన్‌కు వరుసగా హత్య బెదిరింపులు వస్తున్నాయి. గతంలోనూ పలుమార్లు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఆయనకు హెచ్చరికలు వస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో సల్మాన్ నివాసం ఉంటున్న బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్మెంట్ దగ్గర ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరపడంతో పాటు అంతకుముందు పన్వేల్ ఫామ్‌హౌస్‌లోకి చొరబడేందుకు కొందరు ట్రై చేశారు. ఇటీవల సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు వచ్చిన కేసులో కర్ణాటకలోని హవేరిలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అలాగే, రాజస్థాన్‌లో మరో వ్యక్తిని కూడా మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌కు అప్పజేప్పారు. వరుస బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో సల్మాన్ కు మహారాష్ట్ర సర్కార్ భారీ భద్రతను పెంచింది.
తాజావార్తలు
-
Virat Kohli: ఫైనల్ తర్వాత వైభవ్‌ను వెతుక్కుంటూ వెళ్లిన కోహ్లీ.. 43 సెకన్ల సంభాషణలో ఏమన్నాడంటే?
-
Nissan Tecton SUV: నిస్సాన్ టెక్టన్ SUV జూలై 9న ఆవిష్కరణ.. ప్రీమియం ఫీచర్లతో క్రెటా, సెల్టోస్‌కు గట్టి పోటీ
-
Dhurandhar 2: ఈ రోజు ఓటీటీలోకి స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’… ప్రశంసలు కురిపించిన అంబానీ.!
-
Vaibhav-MS Dhoni: ఎంఎస్ ధోనీ కాదు బిహార్‌కు గుర్తింపు వైభవ్ వల్లే.. ప్రముఖ స్పోర్ట్స్ ప్రజెంటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Bank Account: ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ ఖాతాలు ఉండొచ్చు? ఎక్కువ ఖాతాలు ఉంటే లాభమా? నష్టమా?
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!