Saif Ali Khan Case: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడి చేసిన ఘటన యావత్ దేశాన్ని షాక్‌కి గురిచేసింది. ముంబై బాంద్రాలోని సైఫ్ ఇంట్లోకి దూరిన దుండగుడు అతడిపై కత్తితో దాడి చేసి ఆరు చోట్ల గాయపడిచాడు. సైఫ్‌కి వెన్నుముక, మెడపై తీవ్రగాయాలయ్యాయి. వెంటనే లీలావతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం బాగుందని వైద్యులు చెప్పారు. అయితే, ఈ కేసులో దుండగుడిని పట్టుకునేందుకు పోలీసులు ఇప్పటికే ప్రత్యేక టీంమ్‌లను ఏర్పాటు చేశారు.
Read Also: Donald Trump: ట్రంప్ ప్రమాణస్వీకారం తర్వాత రోజే “ఇమ్మిగ్రేషన్” దాడి ప్రారంభం..
ఇదిలా ఉంటే, ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌కి చెందిన ఒక అనుమానితుడిని ముంబై పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఈ రోజు తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. నటుడిపై దాడి జరిగి రెండు రోజులు గడుస్తున్నా.. దుండగుడి కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్‌పై దాడి దాడి చేసిన తర్వాత దాదార్‌లోని ఒక దుకాణం నుంచి హెడ్‌ఫోన్ కొనుగోలు చేస్తున్నట్లు దుండగుడి తాజా సీసీటీవీ ఫుటేజ్ ఈ రోజు తెల్లవారుజామున బయటపడింది.
ముంబై పోలీసులు ప్రకారం.. దాడి చేసిన వ్యక్తి ముంబై చుట్టూ తిరగడానికి లేదా మరొక ప్రదేశానికి పారిపోవడానికి బాంద్రా నుండి రైలు ఎక్కి ఉండవచ్చు. ప్రధాన నిందితుడిని గుర్తించడానికి అనేక పోలీసు బృందాలు ప్రస్తుతం నగరంలోని వివిధ రైల్వే స్టేషన్ల సీసీటీవీ ఫుటేజ్‌లను సమీక్షిస్తున్నాయి.