మాజీ ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్‌కు ఢిల్లీ హైకోర్టులో ఉపశమనం లభించింది. అరెస్ట్ నుంచి ఆమెకు రక్షణను అక్టోబర్ 4 వరకు న్యాయస్థానం పొడిగించింది. ఐఏఎస్ ఉద్యోగం సంపాదించేందుకు ఆమె అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో ఆమెపై యూపీఎస్సీ వేటు వేసింది. భవిష్యత్‌లో జరిగే ఏ పరీక్షలకు హాజరుకాకుండా నిషేధం విధించింది. అనంతరం కేంద్ర ప్రభుత్వం కూడా ఆమెను ఐఏఎస్ సర్వీస్ నుంచి డిశ్చార్జ్ చేసింది. అయితే ఆమె అక్రమాలపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ ధర్మాసనాన్ని కోరగా అంగీకరించింది. ఆ గడువు నేటితో ముగియడంతో.. గురువారం మరొకసారి జస్టిస్ చంద్ర ధారి సింగ్ పొడిగించారు. దీంతో ఆమెకు కోర్టులో ఉపశమనం లభించింది.
ఇది కూడా చదవండి: Godhra Train Burning Case: “గోద్రా రైలు దహనం”పై జనవరి 15న సుప్రీంకోర్టు విచారణ..
పూణె ట్రైనీ ఐఏఎస్‌గా ఉన్నప్పుడు లేనిపోని అధికారాలు కావాలంటూ గొంతెమ్మ కోర్కెలు కోరి కష్టాలు తెచ్చుకుంది. ఆమె తీరుపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లడంతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. దివ్యాంగురాలు కాకపోయినా.. దొంగ మెడికల్ సర్టిఫికెట్ సంపాదించి వికలాంగ కోటాలో జాబ్ సంపాదించింది. అంతేకాకుండా ఓబీసీ సర్టిఫికెట్‌ను కూడా ఆమె దుర్వినియోగం చేసినట్లు తేలడంతో వేటు పడింది. ఈ పరిణామాలతో ఆమె క్రిమినల్ కేసు ఎదుర్కొంటుంది. బెయిల్ ఇవ్వాలని కోరగా అక్టోబర్ 4కు న్యాయస్థానం వాయిదా వేసింది. పూజా ఖేద్కర్ పెద్ద కుట్రకు తెరలేపారని పోలీసులు కోర్టుకు తెలియజేశారు. అయితే ఖేద్కర్ న్యాయవాది అభ్యర్థన మేరకు జస్టిస్ చంద్ర ధారి సింగ్.. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను వాయిదా వేశారు. అక్టోబర్ 4కు వాయిదా వేసి మధ్యంతర ఉత్తర్వులు కొనసాగించాలని జస్టిస్ చంద్ర ధారి సింగ్ ఆదేశించారు.
ఇది కూడా చదవండి: AP CM Chandrababu: మౌలిక సదుపాయాల కల్పనతో క్రీడారంగానికి మళ్లీ ప్రోత్సాహం