Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్

  • గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్
  • టోపీ, మాస్క్, కళ్లద్దాలతో కోల్‌కతాలో హల్‌చల్
  • వీడియో వైరల్
Saayoni Ghosh

Saayoni Ghosh

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఓటమి తర్వాత పరిణామాలు తల్లకిందులయ్యాయి. భారీ స్థాయిలో మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరుగుబావుటా ఎగరేశారు. దీంతో పార్టీ తీవ్ర సంక్షోభంలో వెళ్లిపోయింది.

×
×
Ad

ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున విస్తృతంగా ప్రచారం చేసి హైలెట్‌గా నిలిచిన ఎంపీ సయానీ ఘోష్ కూడా తిరుగుబాటు లిస్ట్‌లో చేరిపోయింది. ఎన్నికల సమయంలో 2019లో మమతా బెనర్జీ ప్రధానిమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఫైర్‌బ్రాండ్ నాయకురాలుగా పేరుగాంచిన సయానీ ఘోష్ తిరుగుబాటులో లిస్ట్‌‌లో చేరడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక గత కొద్దిరోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఆమె అకస్మాత్తుగా గురువారం కోల్‌కతా ఎయిర్‌పోర్టులో ప్రత్యక్షమైంది. పూర్తిగా గెటప్ మార్చేసింది. టోపీ, మాస్క్, కళ్లద్దాలు ధరించి.. ఎవరూ గుర్తుపట్టని విధంగా వస్త్రధారణ మార్చేసింది. పూర్తిగా ముఖాన్ని కప్పుకుని ఉంది. వెంటనే కారు ఎక్కి వెళ్లిపోయింది. సయానీ ఢిల్లీ నుంచి కోల్‌కతాకు వచ్చినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.