S Jaishankar on Pakistan economic crisis: పీకల్లోతు ఆర్ధిక కష్టాల్లో ఉంది దాయాది దేశం పాకిస్తాన్. తమ దేశం ఇప్పటికే దివాళా తీసిందని సాక్షాత్తు అక్కడి మంత్రులే చెబుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. క్లిష్ట సమయంలో ఐఎంఎఫ్ కానీ, పాక్ మిత్రదేశాలు అయిన సౌదీ, యూఏఈ, చైనా వంటివి కూడా పాకిస్తాన్ కు సాయాన్ని అందించేందుకు ఇష్టపడటం లేదు. మరోవైపు రాజకీయ అస్థిరత కూడా పాకిస్తాన్ పరిస్థితి దిగజారడానికి కారణం అయింది. ఐఎంఎఫ్ తన షరతులకు అంగీకరిస్తేనే తప్పా పాకిస్తాన్ కు బెయిలౌట్ ప్యాకేజీని ఇస్తామని స్పష్టం చేసింది.
Read Also: Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఏడాది.. శాంతి నెలకొనేదెప్పుడు..?
ఇదిలా ఉంటే పలువరు పాకిస్తాన్ జర్నలిస్టులు, మాజీ సైనికాధికారులు భారత్, పాకిస్తాన్ ను ఆదుకోవాలని కోరుతున్నాయి. దీనిపై ఇప్పటికే భారత్ స్పష్టతతో ఉంది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. భారత్ కు శ్రీలంక లాగా, పాకిస్తాన్ కాదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే తాజాగా డైలాగ్‌లో మాట్లాడుతూ పాకిస్తాన్ ఎకనామిక్ క్రైసిస్ గురించి ప్రస్తావించారు.
ఒక దేశం తన ఆర్థిక సమస్యలను పరిష్కరించుకున్నట్లే, రాజకీయా, సామాజిక సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఒక దేశం ప్రాథమిక పరిశ్రమ ఉగ్రవాదం అయితే ఆ దేశం క్లిష్టపరిస్థితుల నుంచి బయటపడదని, సంపన్నదేశంగా మారదని పాకిస్తాన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మీ సమస్యలను మీరే పరిష్కరించుకోవడానికి సిద్ధంగా లేకుంటే ఇతరులు పరిష్కరించలేదని అన్నారు. ఏ దేశం కూడా తమ పొరుగు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉండాలని కోరుకోదని తెలిపారు. 30 ఏళ్ల క్రితం భారత్, పాకిస్థాన్ ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యనే ఎదుర్కొందని అయితే కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో సమస్య నుంచి బయటపడిందని జైశంకర్ అన్నారు. పాకిస్తాన్ కూడా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఆసియా ప్రాముఖ్యత పెరుగుతోందని ఆయన వెల్లడించారు.
