Russia Aircraft Deal: భారత్‌కు రష్యా బిగ్ ఆఫర్.. 105 విమానాలు, దేశంలోనే SJ-100 తయారీ!
- భారత్‌లో సివిల్ ఏవియేషన్ మార్కెట్‌పై రష్యా ఫోకస్
- IL-114-300 విమానాల కోసం పలు భారతీయ కంపెనీలతో చర్చలు
- భారత్‌లో SJ-100 తయారీకి UAC–HAL భాగస్వామ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia Aircraft Deal: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్ ఇచ్చింది. భారత పౌర విమానయాన రంగంలో రష్యా తన స్థానాన్ని దక్కించుకోవాలని భావిస్తోంది. రష్యాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్(UAC) భారత విమానయాన సంస్థలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకోవాలని భావిస్తోంది. ఈ డీల్‌లో మొత్తం 105 డొమెస్టిక్ ప్యాసింజర్ విమానాలు ఉండొచ్చని తెలుస్తోంది. ఈ చర్చల్లో ప్రధానంగా IL-114-300 టర్బోప్రాప్ విమానాల కొనుగోళ్లు ఉన్నాయి. ఈ విమానాలకు సంబంధించిన పలు ఒప్పందాలు ఖరారు చేసుకోవాలని రష్యా భావిస్తోంది.
పిన్నాకిల్ ఎయిర్‌కు 50 విమానాలు, ఎయిర్ కేరళకు 20 విమానాలు, స్లీక్ ఏవియేషన్ 35 విమానాలు అందించాలని డీల్స్‌లో ఉన్నట్లు సమాచారం. ఇవన్నీ కలిపితే 105 విమానాల వరకు ప్రతిపాదిత డీల్‌లో అమ్మాలని రష్యా భావిస్తోంది. చిన్న విమానాశ్రయాలు, తక్కువ దూరం ప్రాంతీయ మార్గాల్లో ఈ విమానాలను ఉపయోగించే అవకాశం ఉంది.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే, విమానాల విక్రయాలతో పాటు భారత్‌లోనే విమానాల తయారీకి రష్యా ప్రాధాన్యత ఇస్తోంది. ముఖ్యంగా SJ-100 ప్రాంతీయ జెట్ ఉత్పత్తిని భారత్‌లో స్థానికీకరించే ప్రాజెక్టుపై UAC, హిందూస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్(HAL) కలిసి పనిచేస్తున్నాయి. SJ-100 ఉత్పత్తికి సంబంధించిన లైసెన్సింగ్ ఒప్పందం ఇప్పటికే 80 శాతానికి పైగా ఖరారైనట్లు తెలుస్తోంది.
2025లో HAL, UAC మధ్య SJ-100 ఉత్పత్తికి సంబంధించిన అవగాహన ఒప్పందం కుదిరింది. భారతదేశంలో ఈ విమానాలను తయారు చేయడం ద్వారా ప్రాంతీయ కనెక్టివిటీతో పాటు దేశీయ సివిల్ ఏవియేషన్ తయారీ సామర్థ్యాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత్‌లో ఏడాదికి 20 నుంచి 40 SJ-100 విమానాల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!