Site icon NTV Telugu

Russia: జీ20 సమావేశాలను అస్థిర పరిచేందుకు ఆ దేశాలు ప్రయత్నిస్తున్నాయి.

G20

G20

Russia Accuses West: భారత్ లో జరుగుతున్న జీ20 సమావేశాలను అస్థిర పరిచేందుకు వెస్ట్రన్ దేశాలు ప్రయత్నిస్తున్నాయంటూ రష్యా మండిపడింది. రష్యాకు వ్యతిరేకంగా ఈ వేదికను ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాయని శనివారం ఆరోపించింది. అమెరికా, యూరోపియన్ యూనియన్, జీ7 దేశాలు రష్యా వ్యతిరేక మార్గంలో సమావేశాలను వాడుకుంటున్నాయని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. బెంగళూర్ లో జరిగిన జీ20 ఆర్థిక మంత్రుల సమావేశంలో సమిష్టి నిర్ణయాలకు అంతరాయం కలిగించాలని ప్రయత్నించిందని రష్యా ఆరోపించాయి.

Read Also: Khalistan: భారత్‌‌పై విషాన్ని చిమ్మిన అమృత్‌పాల్ సింగ్.. పంజాబ్ స్వతంత్రం అవుతుందని ప్రగల్భాలు..

పాశ్యాత్య దేశాలు సాధ్యమైనంత వరకు తన విధ్వంస విధానాన్ని విడిచిపెట్టాలని, బహుళ ధ్రువ ప్రపంచం యొక్క వాస్తవ లక్ష్యాలను గుర్తించాలని రష్యా పిలుపునిచ్చింది. శనివారం జరిగిన జీ20 దేశాల ఆర్థిక మంత్రుల సదస్సులో రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఖండిస్తూ సంయుక్త తీర్మానం చేయాలని కొన్ని దేశాలు భావించాయి. అయితే దీన్ని చైనా, రష్యాలు తప్పుపట్టాయి. దీంతో సంయుక్త ప్రకటన సాధ్యం కాలేదు. ఈ ఏడాది జీ20 అధ్యక్ష పదవిని భారత్ తీసుకుంది. దీంతో ఈ ఏడాది జీ20 సదస్సులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరగనున్నాయి.

Exit mobile version