PM Modi: మోడీ అపాయింట్మెంట్పై షరతులు.. కోవిడ్ టెస్ట్ చేయించుకుంటేనే పర్మిషన్
- మోడీ అపాయింట్మెంట్పై షరతులు
- కోవిడ్ టెస్ట్ చేయించుకుంటేనే పర్మిషన్
- ఢిల్లీ సీఎం సహా పలువురు టెస్టులు చేయించుకున్నట్లు సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు అమాంతంగా పెరిగిపోయాయి. పదుల్లో ఉండే కేసులు ఇప్పుడు వేలల్లోకి వచ్చేశాయి. అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరిగిపోయాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 7 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ సూచించింది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి కార్యాలయం కూడా అప్రమత్తం అయింది. ఇకపై ప్రధాని మోడీని కలిసే మంత్రులు, ప్రభుత్వ శాఖ అధికారులు, ఇతర ప్రముఖులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ (RT-PCR) పరీక్ష చేయించుకోవాలని పీఎంవో సూచించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
ఇది కూడా చదవండి: Kubera: ‘కుబేర’ నుండి పిపిపి.. డుండుండుం.. సాంగ్ రిలీజ్
Also Read
పీఎంవో సూచన మేరకు బుధవారం సాయంత్రం ప్రధాని మోడీని కలవనున్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఏడుగురు ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా ఢిల్లీకి చెందిన దాదాపు 70 మంది బీజేపీ కార్యకర్తలు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకోనున్నట్లు వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల పార్టీ నాయకులకు రాత్రి 7:30 గంటలకు విందు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో అందరూ కూడా కోవిడ్ టెస్ట్ చేయించుకున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Sonam Raghuwanshi: రాజాను పెళ్లి చేసుకోను.. ప్రియుడితోనే ఉంటాను.. తల్లిని హెచ్చరించిన సోనమ్
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారం విడుదల చేసిన లెక్కల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 306 కొత్త కేసులు నమోదవడంతో పాటు ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 7,121లకు చేరింది. దేశంలో కొవిడ్ మృతుల సంఖ్య 74కు పెరిగింది. కేరళలో అత్యధికంగా 2,223 యాక్టివ్ కేసులు ఉండగా.. గుజరాత్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్ తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ డకౌట్ అవుతాడు’.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
-
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ సంచలనంపై అశ్విన్ ప్రశంసల వర్షం.. భవిష్యత్తు సూపర్ స్టార్
-
Kerala: “దీపం” వెలిగించడంపై రచ్చ.. వివాదంలో ముస్లిం మహిళా ఎమ్మెల్యే
-
TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
-
Anantha Sriram: “విషం కక్కే రివ్యూల దారిద్యాన్ని దాటి ‘పెద్ది’ బాక్సాఫీస్ బద్దలుకొట్టింది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!