RSS Chief Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల్లో కీలక వ్యాఖ్యలు చేశారు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్.. పహల్గామ్‌లో ఉగ్రదాడికి పాల్పడ్డ ముష్కరులు భారతీయులను మతం ఏమిటని అడిగి కాల్చిచంపారని, ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారన్నారు.. ఉగ్రవాదులు మతమేంటో అడిగి టూరిస్టులను హతమార్చారు.. ఈ ఘటనలో దేశం మొత్తం రగిలిపోయిందన్నారు.. అయితే, మన బలగాలు ఉగ్రదాడికి దీటుగా సమాధానమిచ్చాయి.. ఇక, ఆపరేషన్ సిందూర్‌తో మన మిత్రదేశాలేవో తెలిసిపోయాయన్నారు..
Read Also: Philippinesలో భారీ భూకంపం.. 72కు చేరిన మృతుల సంఖ్య
ఇక, భారత దేశాన్ని అస్థిరపర్చేందుకు సంఘ విద్రోహ శక్తులు ప్రయత్నిస్తూనే ఉన్నాయి అన్నారు మోహన్ భగవత్… పక్క దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు కలవరపెడుతున్నాయన్న ఆయన.. ప్రభుత్వాలు సంక్షేమాన్ని విస్మరిస్తే ప్రజల్లో ఆగ్రహం పెరుగుతుందన్నారు.. నేపాల్‌లో జెన్‌జీ ఉద్యమం ప్రభుత్వాలకు హెచ్చరికలాంటిది అంటూ హెచ్చరించారు.. ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసం పాలసీలు తయారు చేయాలని సూచించారు.. మన దేశంలో వైవిధ్యం విభజనలకు కారణమవుతోందని, అయినా మనమంతా ఒక్కటేనని, వైవిధ్యం అనేది ఆహారం, జీవన పరిస్థితులకే పరిమితమన్నారు. చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవడం సరైనది కాదని, ఇలాంటి అరాచకత్వాన్ని ఆపాలన్నారు. ఐక్యమత్యమే మన బలం, విడిపోతే నిలబడలేం అన్నారు.. మరోవైపు.. అమెరికా సుంకాలు దేశ ప్రజలందరిపై ప్రభావితం చూపించాయి.. మనం ఇప్పుడు స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు మోహన్ భగవత్.. కాగా, మహారాష్ట్రలోని నాగపూర్‌లో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది విజయదశమి వేడుకలను ఉద్దేశించి మోహన్ భగవత్ కీలక ప్రసంగం చేశారు..