Site icon NTV Telugu

Tejashwi Yadav: తేజస్వి యాదవ్ హామీల వర్షం.. జీవికా దీదీలకు రూ.30 వేలు ఇస్తామని ప్రకటన

Tejashwi Yadav2

Tejashwi Yadav2

బీహార్ ఎన్నికల వేళ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. తాజాగా బుధవారం తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. మా ప్రభుత్వం ఏర్పడగానే జీవికా సీఎం (కమ్యూనిటీ మొబిలైజర్స్) దీదీలను పర్మినెంట్ చేసి.. నెలకు రూ.30,000 జీతం ఇస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా జీవికా దీదీలు తీసుకున్న రుణాలపై వడ్డీని మాఫీ చేస్తామని ప్రకటించారు. అలాగే రాబోయే రెండేళ్ల పాటు వడ్డీ లేని క్రెడిట్ కూడా ఇస్తామని వెల్లడించారు. అదనంగా రూ.2,000 భత్యం కూడా ఇస్తామని తెలిపారు. వీటితో పాటు రూ.5 లక్షల విలువైన బీమా కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: INDIA Bloc: దీపావళి తర్వాత కూటమిలో జ్ఞానోదయం.. తేజస్వి యాదవ్‌కు చిగురిస్తున్న కొత్త ఆశలు!

జీవికా సీఎం (కమ్యూనిటీ మొబిలైజర్స్) పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఈ పథకం తీరుపై తేజస్వి యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో జీవికా దీదీలకు అన్యాయం జరిగిందని ధ్వజమెత్తారు. అందుకే మా ప్రభుత్వం రాగానే జీవికా దీదీలకు న్యాయం చేస్తామని తేజస్వి యాదవ్ భరోసా కల్పించారు.

ఇది కూడా చదవండి: Mamdani-Modi: భారత్‌లో కొంతమందికే చోటుంది.. దీపావళి వేడుకలో మోడీ లక్ష్యంగా న్యూయార్క్ మేయర్ అభ్యర్థి విమర్శలు

‘‘మేము ఇప్పటికే బీటీఐ, ఎంఏఏ యోజనను ప్రకటించాము. బీ ఫర్ బెనిఫిట్, ఇ ఫర్ ఎడ్యుకేషన్, టీ ఫర్ ట్రైనింగ్, ఐ ఫర్ ఇన్‌కమ్. దీని అర్థం కుమార్తెలు పుట్టిన క్షణం నుంచి వారు ఆదాయం పొందే వరకు వారి కోసం ఈ ప్రత్యేక కార్యక్రమం అమలు చేయబడుతుంది. మేము ఎంఏఏ యోజనను కూడా అమలు చేస్తాము. ఎం ఫర్ మకాన్, ఎ ఫర్ ‘ఆన్’ (ఆహారం), ఎ ఫర్ ‘ఆమ్దానీ’ ఆదాయం. బీహార్‌కు ఇప్పుడు కావలసింది ఆర్థిక న్యాయం.’’ అని తేజస్వి యాదవ్ అన్నారు.

బీహార్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుత డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో ప్రజలు విసుగెత్తిపోయారని.. అందుకే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో అవినీతి, నేరాలు పెరిగిపోవడమే కాకుండా నిరుద్యోగం, వలసలతో విసుగెత్తిపోయారని పేర్కొన్నారు. గతంలో ఆర్జేడీ ఇచ్చిన హామీలను ప్రస్తుత ప్రభుత్వం కాపీ కొట్టిందని తేజస్వి యాదవ్ విమర్శించారు.

Exit mobile version