120 Cr In PFI Accounts: దేశవ్యాప్తంగా మరొకసారి NIA సోదాలు చేస్తోంది. 25 రాష్ట్రాల్లో పిఎఫ్ఐ సంస్థలపై NIA సోదాలు మూడోసారి నిర్వహిస్తుంది. ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలతో పాటు ముఖ్య నాయకులను హత్యకు కుట్ర చేసినట్టుగా అభియోగాలపై ఈసోదాలు నిర్వహిస్తుంది. పాట్నాలో ప్రధానమంత్రిని హత్య చేసినందుకు కుట్ర చేసినట్లుగా NIA ఆరోపించింది. ఆరు నెలల కాలంలోనే PFI అకౌంట్ లోకి 120 కోట్ల రూపాయలు వచ్చినట్లు కేంద్ర హోంశాఖ గుర్తించింది. భారీగా విదేశాల నుంచి డబ్బులను సేకరించిన PFI. ఈడితో కలిసి NIA మరొకసారి సోదాలు నిర్వహిస్తుంది.
పీఎం నరేంద్ర మోడీపై దాడి చేసేందుకు PFI పథకం రచించిందని ఈడీ సంచలన విషయం వెల్లడించింది. కాగా, ఈ మధ్య PFI కార్యాలయాలు.. దాని మద్దతుదారులపై NIA, ED దాడులు చేసి పదుల సంఖ్యలో అరెస్టులు చేశాయి. ఈనేపథ్యంలో.. జులై 12 న బీహార్ లో జరిగిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ర్యాలీని లక్ష్యంగా చేసుకొని, దాడి చేసేందుకు PFI పథకం పన్నినట్లు తెలిసిందని ED వెల్లడించింది. PFI ఈ దాడి చేయలేకపోయింది. కేరళలో ఇటీవల అరెస్టయిన PFI సభ్యుడు షఫీక్ పాయెత్ రిమాండ్ రిపోర్టులో ఈ విషయాలను ED వెల్లడించింది. కాగా.. జులై 12న ప్రధాని మోదీ పాట్నాకు వెళ్లే సమయంలోనే దాడులు చేసేందుకు తమ సభ్యులకు PFI కోచింగ్ క్యాంపును ఏర్పాటు చేసిందని తెలిపింది.
సెప్టెంబర్ 22న దేశవ్యాప్తంగా ఎన్ఐఏ, ఈడీ, రాష్ట్ర పోలీసుల సంయుక్త బృందం 15 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించింది. ఈనేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, కేరళ , కర్ణాటక , తమిళనాడు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, పశ్చిమ బెంగాల్ , బీహార్, మణిపూర్ రాష్ట్రాల్లో సోదాలు చేపట్టింది. ఇక మొత్తంగా 96 చోట్ల జరిపిన దాడుల్లో 106 మందికి పైగా పీఎఫ్‌ఐ సభ్యులను అరెస్టు చేశారు. అయితే.. అరెస్టయిన వారిలో పిఎఫ్‌ఐ ఛైర్మన్ ఒఎంఎ సలామ్, వైస్ ఛైర్మన్ ఇఎం అబ్దుల్ రహీమ్, జాతీయ కార్యదర్శి నజరుద్దీన్ ఎలమారం, కేరళ రాష్ట్ర చీఫ్ సిపి ముహమ్మద్ బషీర్, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు ప్రొఫెసర్ పి కోయా, ఎస్‌డిపిఐ వ్యవస్థాపక అధ్యక్షుడు అబూ బకర్ ఉన్నారు.