PMO Fake ID Case: ప్రధాని భద్రతలో కలకలం.. ఫేక్ PMO ఐడీ కేసులో ట్విస్ట్..
- ప్రధాని ముంబై పర్యటనకు ముందు కలకలం..
- వేదిక వద్ద ఇద్దరు అనుమానితుల అరెస్ట్..
- ఒకరి వద్ద నకిలీ పీఎంఓ ఐడీ, మరొకరి వద్ద గన్..
- నా క్లయింట్‌ను తప్పుదోవ పట్టించారన్న నిందితుడి లాయర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PMO Fake ID Case: ప్రధాని నరేంద్ర మోడీ ముంబై పర్యటనకు ముందు భద్రతా కలకలం ఏర్పడింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్లో ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరి వద్ద నకిలీ ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ఐడీ కార్డు, ఒకరి వద్ద తుపాకీ లభ్యం కావడం సంచలనంగా మారింది. అనుమానితుల్లో ఒకరిని రోహన్ పరేఖ్‌గా గుర్తించినట్లు తెలుస్తోంది.
అయితే, ఈ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. రోహన్ పరేఖ్ తరపున హాజరైన లాయర్ తన క్లయింట్ మోసపోయి ఉండొచ్చని ముంబై కోర్టులో వాదించారు. కోర్టు విచారణ సందర్భంగా రోహన్‌కు అధికారికంగా కనిపించే ఆఫర్ లెటర్, గుర్తింపు కార్డు, ప్రధాని మోడీ సంతకంతో ఉన్నట్లు చెబుతున్న ఒక లేఖ అందాయని లాయర్ తెలిపారు. ఇదే కాకుండా ప్రధాని కార్యాలయంలో అదనపు కార్యదర్శి పేరుతో ఉన్నట్లు చెబుతున్న ఓ ఈమెయిల్ కూడా రోహన్‌కు వచ్చినట్లు కోర్టుకు వెల్లడించారు.
Also Read
- Mallikarjun Kharge: ఫలించిన కాంగ్రెస్ పోరాటం.. ఖర్గే ర్యాలీ తర్వాత శుద్ధి చేసిన ఘటనపై ఎఫ్ఐఆర్
- Putin: బ్రిక్స్‌కు ముందే ఢిల్లీకి వస్తున్న పుతిన్.. కారణమిదే!
- PM Modi: మోడీ ముంబై టూర్లో కలకలం.. ఇద్దరు అనుమానితుల నుంచి నకిలీ ID, తుపాకీ స్వాధీనం!
- Supreme Court: ‘మా మనసులో ఒక ఆలోచన ఉంది’.. హాస్టళ్ల భద్రతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఈ పత్రాలు, సంప్రదింపుల కారణంగానే తన క్లయింట్ నిజంగా పీఎంఓకు సంబంధించిన ఉద్యోగం పొందినట్లు నమ్మాడని ఆయన తరుఫు న్యాయవాది వాదించారు. ఎవరో వ్యక్తి రోహన్‌ను మోసం చేసి ఉండొచ్చని పేర్కొన్నారు. అయితే, రోహన్ చెబుతున్నవి నిజాలా? లేదా? , అతడి వద్ద లభించిన ఐడీ కార్డు నిజమైందా.? ఎవరు తయారు చేశారు? దీని వెనక ఎవరున్నారనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ముంబై కోర్టు రోహన్ పరేఖ్‌ను సెప్టెంబర్ 11 వరకు పోలీస్ కస్టడీకి పంపింది.
తాజావార్తలు
-
PMO Fake ID Case: ప్రధాని భద్రతలో కలకలం.. ఫేక్ PMO ఐడీ కేసులో ట్విస్ట్..
-
Redmi Smart Phone: 1.5K AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీ.. రెడ్ మీ నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్..
-
Pan India Star: పాన్ ఇండియా కూడా పాతదైపోయిందా? హీరోలకు నెక్ట్స్ ట్యాగ్ ఏంటి?
-
Minister Satya Kumar: కొత్త పార్టీ పెట్టుకో.. కానీ ముందు ప్రజలకు ఆ లెక్క చెప్పు..
-
KTR : రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ సంచలన కామెంట్స్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!