Site icon NTV Telugu

Tejashwi Yadav: నడిరోడ్డుపై కళాకారులతో తేజస్వి యాదవ్ డ్యాన్స్.. వీడియో వైరల్

Tejashwiyadav

Tejashwiyadav

బీహార్‌లో ప్రస్తుతం ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. త్వరలోనే ఎన్నికల నోటిఫికేన్ రానుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇక ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా రాహుల్‌గాంధీ సమక్షంలో ఓటర్ అధికార్ యాత్ర జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కూడా పాల్గొన్నారు. సెప్టెంబర్ 1న యాత్ర ముగిసింది. ఈ కార్యక్రమానికి ఇండియా కూటమి నేతలంతా హాజరయ్యారు.

ఇది కూడా చదవండి: UP: ఇన్‌స్టాలో వివాహితతో ప్రేమ.. హోటల్‌కు పిలిచి ప్రియుడు ఏం చేశాడంటే…!

ఓటర్ అధికార్ యాత్ర ముగియడంతో తేజస్వి యాదవ్ ఆటవిడుపు కోసం మేనల్లుడితో కలిసి షికారుకు వెళ్లారు. దీంతో ఇటీవల పాట్నాలో కొత్తగా ప్రారంభమైన మెరైన్ డ్రైవ్ ఎక్స్‌ప్రెస్‌వేపైకి వెళ్లారు. అక్కడే కొందరు సోషల్ మీడియా కంటెంటర్లు, కళాకారులు డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేస్తున్నారు. వారిని చూసిన తేజస్వి యాదవ్ వారితో కలిసి స్టెప్స్ చేశారు. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషిన్ సిగ్నేచర్ స్టెప్స్ వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలను తేజస్వి సోదరి రోహిణి ఆచార్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఇది కూడా చదవండి: China: చైనా సైనిక కవాతులో పాల్గొన్న పుతిన్, జిన్‌పింగ్, కిమ్

అలాగే కొంత మంది యువతీయువకులను కూడా తేజస్వి యాదవ్ కలిశారు. ఒక సామాన్యుడిలా వారితో కలిసి పోయి సంభాషించారు. చాయ్‌ తాగుతూ వారితో మాట్లాడారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను తేజస్వి యాదవ్ పోస్ట్ చేశారు. తన మేనల్లుడు సింగపూర్ నుంచి వచ్చాక డ్రైవ్‌కి వెళ్దామంటే.. ఇలా రోడ్డుపైకి వచ్చినట్లు తెలిపారు. యువ తోటి కళాకారులను కలిశామని.. వారు పాటలు పాడుతూ రీల్స్ చేస్తూ కనిపించారని పేర్కొన్నారు. వారు పట్టుబట్టినప్పుడు తాను కూడా డ్యాన్స్ చేసినట్లు చెప్పారు. కులం, మతాలకు అతీతంగా యువత అంచనాలకు.. ఆకాంక్షలు, కలలు.. ఆశలతో అడుగులు వేస్తామని.. కొత్త బీహార్‌ను నిర్మించడానికి అధికార మార్పు తీసుకురావాలని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు.

 

Exit mobile version