BJP: బీహార్ రాజకీయంలో కేంద్రమంత్రి, బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ పార్టీ జేడీయూ, లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీలు త్వరలో విలీనం అవుతాయంటూ కేంద్రమంత్రి శనివారం వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. జనవరిలోగా లోక్‌సభ ఎన్నికల ముందు సీట్ల పంపకాలపై ఏర్పాట్లు చేయాలని ఇండియా కూటమికి నితీష్ కుమార్ చెప్పడంపై మీడియా ప్రశ్నించడంతో గిరిరాజ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Salaar vs Dunki: ఇక కదా కిక్కంటే.. డుంకీ డే 1 మొత్తాన్ని ఓవర్సీస్ లో కొట్టేశాడు ప్రభాస్!
త్వరలోనే ఆర్జేడీలో జేడీయూ విలీనం అవుతోందని లాలూ తనకు చెప్పాడని, దీంతో సీట్ల షేరింగ్ తలెత్తదని గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఇటీవల పార్లమెంట్ సమావేశాలు గిరిరాజ్ సింగ్, ఇండియా కూటమి సమావేశానికి రావడానికి లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరూ ఢిల్లీ వచ్చేందుకు ఒకే విమానం ఎక్కారు. కొడుకు తేజస్వీ యాదవ్‌ని బీహార్ ముఖ్యమంత్రిని చేసేందుకు సమయం ఆసన్నమైందని లాలూ చెప్పినట్లు ఆయన వెల్లడించారు. అయితే కేంద్రమంత్రి వ్యాఖ్యల్ని జేడీయూ, ఆర్జేడీ నేతలు తిప్పికొట్టారు.
గతంలో సీఎం నితీష్ కుమార్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉండేవారు. అయితే గతేడాది బీజేపీకి గుడ్ బై చెప్పి ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో బీహార్‌లో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నితీష్, లాలూ ఇద్దరూ ఇండియా కూటమిలో కీలక సభ్యులుగా ఉన్నారు. ఇండియా కూటమి తొలి సమావేశాన్ని నితీష్ కుమార్ పాట్నాలో నిర్వహించారు.