NTV Telugu Site icon

Jharkhand polls: ఫేజ్-2లో సగం అభ్యర్థులు కోటీశ్వరులే.. అత్యల్ప అభ్యర్థి ఆస్తి ఎంతంటే..!

Jharkhandpolls

Jharkhandpolls

జార్ఖండ్‌లో తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండో దశ ఎన్నికల పోలింగ్ కోసం జోరుగా ప్రచారం సాగుతోంది. ఫస్ట్ ఫేజ్‌లో 66 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. రెండో దశ ఓటింగ్ నవంబర్ 20న జరగనుంది. ఇందుకోసం అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. అయితే సెకండ్ ఫేజ్‌లో సగం మంది కోటీశ్వరులే పోటీ చేస్తున్నట్లుగా ఏడీఆర్ నివేదికను బట్టి తెలుస్తోంది. డజన్ల కొద్దీ కోటీశ్వరులు రెండో దశ పోలింగ్ కోసం పోరాడుతున్నారు. ఏడీఆర్ నివేదిక ప్రకారం జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫేజ్ 2లో పోటీ చేస్తున్న 522 మంది అభ్యర్థుల్లో 127 మంది కోటీశ్వరులే.

ఇది కూడా చదవండి: CM Chandrababu: ప్రపంచానికి ఫుడ్ బాస్కెట్‌గా ఏపీ అవతరిస్తుంది

ఏడీఆర్ నివేదిక ప్రకారం సమాజ్‌వాదీ పార్టీ (SP) పకూర్ అభ్యర్థి అక్విల్ అక్తర్ రూ.402 కోట్ల ఆస్తి ఉన్నట్లుగా నామినేషన్ పత్రంలో పేర్కొన్నారు. అత్యల్ప అభ్యర్థి ఆస్తి రూ.100 ఉన్నట్లు డిక్లరేషన్ ప్రకటించారు. అక్తర్ దాదాపు కోటి ( రూ.99,51,816) విలువైన చరాస్తులను ప్రకటించగా … అతని స్థిరాస్తులు రూ. 400 కోట్లకు పైగా ( రూ. 4,02,00,00,000) ఉన్నట్లు తెలిపారు. అక్విల్ అక్తర్ తర్వాత ధన్వర్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నిరంజన్ రాయ్ ఆస్తి రూ. 137 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు ప్రకటించాడు. మూడవ స్థానంలో ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) ధన్వర్ అభ్యర్థి మిహమ్మద్ డానిష్‌కు రూ. 32 కోట్లకు పైగా ఆస్తులను ప్రకటించారు. మహేశ్‌పూర్ (ఎస్టీ) నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జార్ఖండ్ పీపుల్స్ పార్టీ ఇలియన్ హన్స్‌దక్ ఆస్తులు సున్నా అని ప్రకటించారు. బీజేపీలో అత్యధిక సంఖ్యలో కోటీశ్వరుల అభ్యర్థులు ఉన్నారు. 32 మంది అభ్యర్థులు కోటీశ్వరులే ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం), కాంగ్రెస్, ఇతర పార్టీలు ఉన్నాయని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది.

81 సీట్లు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు తొలి ఫేజ్‌లో 43 స్థానాల్లో ఓటింగ్ జరిగింది. మిగతా స్థానాలకు నవంబర్ 20న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి. జార్ఖండ్ అసెంబ్లీ పదవీకాలం వచ్చే ఏడాది జనవరి 5న ముగుస్తుంది.

ఇది కూడా చదవండి: Stephen Miller: ట్రంప్ మిల్లర్ ఎంపికలో భారతీయ టెక్కీలకు, H-1B వీసా కోరేవారికి ఇబ్బందే..

Show comments