NTV Telugu Site icon

RG Kar Ex-Principal: ఈడీ సోదాల్లో వెలుగులోకి సందీప్‌ ఘోష్‌ లగ్జరీ బంగ్లా.. కీలక పత్రాలు స్వాధీనం..!

Sandeep

Sandeep

RG Kar Ex-Principal: కోల్‌కతా ఆర్జీ కర్‌ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్‌ ఘోష్‌తో పాటు ఆయన బంధువుల ఇళ్లలో, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు సందీప్‌ ఘోష్‌కు సంబంధించిన రెండతస్తుల ఓ లగ్జరీ ఇంటిని ఈడీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఇంటి ప్రాపర్టీ సందీప్‌ ఘోష్‌తో పాటు భార్య సంగీతకు చెందినదిగా ఈడీ వర్గాలు తెలిపాయి.

Read Also: Ganesh Chaturthi: ఘనంగా గణేష్ ఉత్సవాలు.. ప్రత్యేక ఆకర్షణగా 75 అడుగుల బెల్లం వినాయకుడు

కాగా, లగ్జరీ బంగ్లా చుట్టూ వందల ఎకరాల ఖాళీ స్థలం ఉంది అని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు గుర్తించారు. సంగీత- సందీప్ విల్లా అనే నేమ్‌ప్లేట్‌ను కలిగి ఉన్న ఈ బిల్డింగ్‌ సందీప్‌ ఘోష్, ఆయన భార్య సంగీత పేరు మీద ఉన్నట్లు వెల్లడైంది. ఇక, ఆ బంగ్లాను ‘డాక్టర్‌ బాబు’ ఇల్లు అని పిలుస్తామని.. సందీప్‌ ఘోష్‌ తరచూ ఫ్యామిలీతో ఇక్కడికి వస్తారని స్థానికులు చెప్పుకొచ్చారు. డాక్టర్ సందీప్ ఘోష్ సూచనల మేరకు ఈ ప్రాంతంలో అనేక ఫామ్ హౌస్‌లు నిర్మించినట్లు, భూములను కూడా కొనుగోలు చేసినట్లు ఈడీ వర్గాలు ఆరోపణ గుప్పించాయి. మొత్తం 9 ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన ఈడీ అధికారులు కోల్‌కతా జాతీయ వైద్య కళాశాలలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తున్న ప్రసూన్‌ ఛటోపాధ్యాయ్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Read Also: Pan World Ganesh Chaturthi: మన గణపయ్య పాన్ వరల్డ్.. ఉగాండాలో చవితి వేడుకలు..!

ఇక, జూనియర్ డాక్టర్‌ హత్యాచార, హత్య కేసు విచారణను సీబీఐకి బదిలీ చేసిన కోల్‌కత్తా హైకోర్టు.. సందీప్‌ ఘోష్‌పై అవినీతి ఆరోపణల కేసు విచారణను సైతం సీబీఐకే హ్యండోవర్ చేసింది. ఈ క్రమంలో ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సందీప్‌ ఘోష్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినా.. ఆయన అభ్యర్ధనను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసులో మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌తో పాటు మరో ముగ్గురు నిందితులకు కోల్‌కతా హైకోర్టు ఇటీవల 8 రోజల సీబీఐ కస్టడీకి ఇచ్చింది. ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో సందీప్‌ ఘోషతో పాటు మరో ముగ్గురు నిందితులు బిప్లవ్ సింఘా, సుమన్ హజ్రా, అఫ్సర్ అలీ ఖాన్‌లను సోమవారం రాత్రి సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Show comments