Site icon NTV Telugu

NEET UG Revised Result: నీట్ యూజీ రివైజ్డ్ ఫలితాలు విడుదల

Neet

Neet

నీట్‌పై సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. నీట్ యూజీ 2024 రివైజ్డ్ ఫలితాలను మళ్లీ విడుదల చేసింది. ఫిజిక్స్‌లో అస్పష్టమైన ప్రశ్న తలెత్తింది. దీంతో సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో ఫలితాలను సవరించి గురువారం మరోసారి విడుదల చేశారు. ఇదిలా ఉంటే జూన్ 4న విడుదల చేసిన ఫలితాల్లో 67 మంది విద్యార్థులు టాప్ ర్యాంకు పొందారు. అయితే తాజా ఫలితాలతో విద్యార్థుల స్కోర్‌లో ప్రభావితం అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: Central Government Jobs: ఉద్యోగాల జాతర.. ఏకంగా 71,321 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..

నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం దేశాన్ని కుదిపేసింది. అన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. విచారించిన న్యాయస్థానం.. పరీక్ష రద్దుకు అంగీకరించలేదు. దీంతో సవరించిన ఫలితాలతో గురువారం మరోసారి విడుదల చేశారు. ఇదిలా ఉంటే బుధవారం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ.. నీట్ రద్దు చేయాలని తీర్మానం చేసింది.

ఇది కూడా చదవండి: Bandi Sanjay : కాంగ్రెస్ + రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా?

Exit mobile version