Central Government Jobs: ఉద్యోగాల జాతర.. ఏకంగా 71,321 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- 2024లో భారీగా కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు.
- పలు విభాగాల్లో అర్హతకు తగ్గట్టుగా ఉద్యోగాలు..
- బ్యాంకు ఉద్యోగాలు కూడా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Central Government Jobs 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పది, ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ ఇలా చదువు పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారి కోసం పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇక వీటి వివరాల్లోకెళ్తే..
* స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్ష-2024 ( SSC CGL 2024 )కు సంబంధించిన నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-B, గ్రూప్-C విభాగాల్లోని 17,727 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను భర్తీ చేయడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దరఖాస్తులు కోరుతోంది. ఇందుకోసం ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే టైర్-1, టైర్-2 పరీక్షలలో ఉతీర్ణత సాధిస్తే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు https://ssc.nic.in/ ను సంప్రదించండి.
Also Read
Bandi Sanjay : కాంగ్రెస్ + రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా?
* 2025-2026 సంవత్సరానికి సంబంధించి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ (CRP)- XIV కు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ఏకంగా పలు బ్యాంక్స్ లో 6128 క్లర్క్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు, కంప్యూటర్ పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్ విధానంలో జులై 1వ తేదీ – 21 తేదీల మధ్య దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు https://www.ibps.in/ సైట్ ను విజిట్ చేయండి.
Xiaomi Redmi K70 Ultra: అదిరిపోయే ఫీచర్లతో కొత్త మొబైల్‌ను తీసుకొచ్చిన షియోమీ..
* ఇక అత్యధికంగా భారత తపాలా శాఖ భారీ జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా ఏకంగా 44,228 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ లో ఆంధ్రప్రదేశ్- 1,355, తెలంగాణ- 981 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు. కేవలం 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలకు https://indiapostgdsonline.gov.in/ సైట్ ను విజిట్ చేయండి.
London: ఎయిర్‌పోర్టులో అమానుషం.. ప్రయాణికులపై పోలీసుల దౌర్జన్యకాండ
^కేంద్ర మంత్రిత్వ శాఖలకు సంబంధించి విభాగాలలోని కార్యాలయాల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టుల భర్తీకి సంబంధించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) SSC MTS 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 8,326 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా అర్హులే. పూర్తి వివరాలకు https://ssc.gov.in/ సైట్ ను విజిట్ చేయండి.
తాజావార్తలు
-
Etela Rajender : ధరణి పేరుతో పేద రైతులకు తీవ్ర అన్యాయం
-
CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
-
Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
-
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
-
Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!