NTV Telugu Site icon

Revanth Reddy: యూపీఎస్సీ చైర్మన్‌తో సీఎం రేవంత్ భేటీ.. టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళనపై చర్చ..

Revanth Reddy Uttam Kumar Reddy

Revanth Reddy Uttam Kumar Reddy

Revanth Reddy: దేశ రాజధాని ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. నిన్న ఏఐసీసీ కార్యక్రమంలో పాల్గొని ముగ్గురు కేంద్ర మంత్రులను కలిశారు. టిఎస్‌పిఎస్‌సిని ప్రక్షాళన చేసే లక్ష్యంతో ప్రభుత్వ చర్యలను ఆయన వేగవంతం చేశారు. ఈరోజు (శుక్రవారం) ఉదయం 11 గంటలకు యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ మనోజ్ సోనీని రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, మరికొందరు సీనియర్ అధికారులు కలిశారు. UPSC పనితీరును గమనించి తెలుసుకున్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఇతర అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి, అధికారులు అధ్యయనం చేయనున్నారు. అయితే.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొంతమంది ఐఏఎస్‌ల బృందం ఇప్పటికే యూపీఎస్సీ పరీక్షా సరళిని అధ్యయనం చేస్తున్న విషయం తెలిసిందే. కేరళ రాష్ట్రంలో పర్యటించిన బృందం ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ కేసుపై సీఐటీ విచారణ చేపట్టింది.

Read also: Super Star Power Star: ఒకే వేదికపై ఈ ఇద్దరూ కలిసి కనిపిస్తే… మాటల్లేవ్-మాట్లాడుకోడాలేవ్

ఈ కేసును విచారించిన సిట్ బృందం సభ్యులతో కూడా ఐఏఎస్ అధికారులు కేసుపై చర్చించనున్నారు. సిట్ దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఐఏఎస్ అధికారులు నివేదిక సిద్ధం చేసారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో టీఎస్‌పీఎస్సీ పరీక్షలు నిర్వహించిందని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే రానున్న రోజుల్లో గతంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పరీక్షల నిర్వహణకు రేవంత్ రెడ్డి సర్కార్ చర్యలు చేపట్టింది. గతంలో జరిగిన కొన్ని పరీక్షలను రద్దు చేశారు. మరికొన్ని వాయిదా పడ్డాయి. వీటిలో కొన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కొత్త చైర్మన్ నియామకం తర్వాత ఈ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. టీఎస్‌పీఎస్సీ సభ్యుల రాజీనామాలపై గవర్నర్ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఈ విషయంలో చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
MLA MS Babu: ఎమ్మెల్యే యూటర్న్‌..! ఓపిక ఉన్నంత వరకు కాదు.. ఊపిరి ఉన్నంత వరకు వైసీపీతోనే..!