Reunited after 21 YEARS, Gujarat school student meets PM Modi: సరిగ్గా 21 ఏళ్ల తర్వాత ఆ ఇద్దరు మళ్లీ ముఖాముఖిగా కలుసుకున్నారు. ఇంతకీ ఎవరనుకుంటున్నారా..? 21 ఏళ్ల క్రితం విద్యార్థిగా ఉన్నప్పుడు మోదీ నుంచి పతకాన్ని అందుకున్న విద్యార్థి, ఆర్మీ మేజర్ గా మళ్లీ ప్రధానిని కలిశారు. దీపావళి వేళ ఈ అద్భుత జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ కార్గిల్ లో భారత జవాన్లతో కలిసి దీపావళి వేడుకలు చేసుకున్నారు. సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు.
Read Also: Extramarital Affair: మరిదితో వదిన రాసలీలలు.. తట్టుకోలేక భర్త ఏం చేశాడంటే?
గుజరాత్‌లోని జామ్‌నగర్ కు చెందిన అమిత్ కుమార్, 2001లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధాని మోదీ చేతుల మీదుగా షీల్డ్ అందుకున్నారు. 2001లో నరేంద్రమోదీ జామ్‌నగర్ లోని బాలాచారి సైనిక్ స్కూల్ ను సందర్శించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న విద్యార్థులతో ముచ్చటించారు. ఆ సమయంలో అమిత్ కుమార్ కూడా సైనిక్ స్కూల్ లో విద్యార్థిగా ఉన్నారు. సైనిక్ స్కూల్ నుంచి పట్టభద్రుడు అయ్యాక సైన్యంలో చేరాడు. సరిగ్గా రెండు దశాబ్ధాల తరువాత ఈ జ్ఞాపకాలను ప్రధానితో పంచుకున్నారు. ఆ సమయంలో మోదీతో కలిసి దిగిన ఫోటోను చూపించారు అమిత్.
2014లో ప్రధాని అయినప్పటి నుంచి ప్రధాని మోదీ, సైనికులతో దీపావళి వేడుకలను జరుపుకుంటున్నారు. 2014లో ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధభూమి సియాచిన్ ప్రాంతంలో సైనికులతో దీపావళి వేడుకలను జరుపుకున్నారు. ఈ ఏడాది కార్గిల్ సెక్టార్ లో మన జవాన్లతో దీపావళి వేడుకలు చేసుకున్నారు ప్రధాని. 1997 పాకిస్తాన్ యుద్ధంలో కార్గిల్ ప్రాంతంలో మన సైనికులు చూపిన ధైర్యాన్ని కొనియాడారు మోదీ.
