Site icon NTV Telugu

Darshan Case: దర్శన్‌కి బిగుసుకుంటున్న ఉచ్చు.. రేణుకాస్వామి హత్యలో కొత్త సాక్ష్యాలు..

Renukaswamy Murder

Renukaswamy Murder

Darshan Case: రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్‌కి ఉచ్చు బిగుసుకుంటోంది. దర్శన్‌తో పాటు అతని సహచరులపై అదనపు చార్జ్ షీట్ ఖరారు కావడంతో రేణుకాస్వామి హత్య కేసు మరో మలుపు తీసుకుంది. చార్జ్ షీట్‌ని ఈ రోజు కోర్టులో దాఖలు చేయనున్నారు. 1000 పేజీల చార్జి షీట్, బలమైన సాంకేతిక, ఫోరెన్సిక్ సాక్ష్యాలను కలిగి ఉంది. ఇది కేసును మరింత బలపరుస్తుందని భావిస్తున్నారు.

Read Also: UK: కింగ్ చార్లెస్ పట్టాభిషేకానికి ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!

ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నుండి ఫోరెన్సిక్ నివేదికలతో సహా 20కి పైగా సాక్ష్యాలను ఛార్జ్ షీట్ పొందుపరిచినట్లు నివేదించబడింది. ఫోరెన్సిక్ సాక్ష్యాలు దర్శన్‌పై అభియోగాలను మరింత బలపరుస్తాయి. సాక్షి పునీత్ మొబైల్ ఫోన్ నుంచి కొన్ని ఫోటోలను సాక్ష్యాలుగా ఛార్జి షీట్‌లో పొందుపరిచారు. నేరం జరిగిన ప్రదేశంలో నీలిరంగు టీ షర్ట్, జీన్స్ ధరించిన దర్శన్‌ని చూపుతున్నట్లుగా ఉంది. గతంలో మొబైల్ నుంచి తొలగించిన ఫోటోలను కూడా ఫోరెన్సిక్ నిపుణులు తిరిగి పొందారు. హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ సాక్ష్యాలు అందించాయి. దర్శన్‌తో పాటు జగ్గా, అనుకుమార్, రవిశకంర్ వంటి నిందితులకు సంబంధించిన మొత్తం 8 ఫోటోలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా, దర్శన్, పవిత్ర గౌడ, మరో ఆరుగురు నిందితుల రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌లను కర్ణాటక హైకోర్టు జస్టిస్ విశ్వజిత్ శెట్టి నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ గురువారం విచారించింది. విచారణను నవంబర్ 26కి వాయిదా వేసింది. దర్శన్ అభిమాని అయిన రేణుకాస్వామి, దర్శన్ మహిళా స్నేహితురాలు పవిత్ర గౌడని విమర్శిస్తూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో ఈ హత్య జరిగింది. చిత్రదుర్గకు చెందిన స్వామిని దర్శన్‌ని కల్పిస్తామని నమ్మించి బెంగళూర్ తీసుకువచ్చారు. చిత్రహింసలకు గురిచేసి, దారుణంగా దాడి చేయడంతో అతడు మరణించాడు.

Exit mobile version