NTV Telugu Site icon

Pushpa 2: పుష్ప సినిమా చూస్తున్న సమయంలో గ్యాంగ్‌స్టర్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు..

Vishal Meshram

Vishal Meshram

Pushpa 2: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తెలుగులోనే కాకుండా హిందీ ల్యాండ్‌లో సత్తా చాటింది. అయితే, ఇలాంటి సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్న ఓ గ్యాంగ్‌స్టర్‌ని పోలీసుల చాకచక్యంగా పట్టుకున్నారు. నాగ్‌పూర్‌లో సినిమా చూస్తున్న సమయంలో డ్రగ్స్ స్మగ్లింగ్, హత్యలతో సంబంధం ఉన్న పేరుమోసిన గ్యాంగ్‌స్టర్‌ని అరెస్ట్ చేశారు.

రెండు హత్యలు, పోలీసులపై దాడులకు సంబంధించి హింసాత్మక చరిత్ర ఉణ్న విశాల్ మెష్రామ్‌ని గురువారం సినిమా క్లైమాక్స్ సమయంలో థియేటర్ నుంచి అరెస్ట్ చేవారు. ఇతడిపై మొత్తం 27 కేసులు ఉన్నాయి. 10 నెలల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. సైబర్ నిఘా, అతడి కొత్త ఎస్‌యూవీ ద్వారా మెష్రామ్ కదలికల్ని పోలీసులు ట్రాక్ చేశారు. అతను తప్పించుకోకుండా థియేటర్ బయట ఉన్న అతడి వాహనంలోని టైర్లలో గాలి తీసేశారు.

Read Also: Sambhal: సంభాల్‌లో బయటపడుతున్న పురాతన ఆనవాళ్లు.. వెలుగులోకి 1857 నాటి బావి..

పోలీసులు థియేటర్‌లోకి ప్రవేశించి, సినిమాలో మునిగిపోయిన గ్యాంగ్‌స్టర్ తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా వేగంగా అరెస్ట్ చేశారు. ఈ ఘటన థియేటర్‌లోని ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచింది. నిందితుడిని ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైలుకి తరలించారు. తర్వాత నాసిక్ జైలుకి ట్రాన్‌ఫర్ చేయనున్నారు.

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 డిసెంబర్ 5న రిలీజై బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. 17 రోజుల్లో రూ.1029.90 కోట్ల నికర వసూళ్లు సాధించింది. ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా పుష్ప అవతరించింది. ప్రస్తుతం పుష్ప ప్రపంచ వ్యాప్తంగా రూ. 1500 కోట్ల గ్రాస్ దాటేసింది.