NTV Telugu Site icon

Puja Khedkar: పూజా ఖేద్కర్ తల్లి మనోరమాపై మర్డర్ కేసు నమోదు

Pujakhedkar

Pujakhedkar

రీకాల్డ్ ఐఏఎస్ ట్రైనీ పూజ ఖేద్కర్ తల్లిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పొలంలో ఓ రైతును తుపాకీతో బెదిరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెపై చర్యలకు ఉపక్రమించారు.

తుపాకీతో రైతును బెదిరించినందుకు పూజా ఖేద్కర్ తల్లి మనోరమపై హత్యాయత్నం అభియోగాలు మోపారు. రెండ్రోజులుగా పరారీలో ఉన్న మనోరమ ఖేద్కర్‌ను గురువారం ఉదయం అరెస్టు చేశారు. వీడియో వైరల్ తర్వాత ఆమె కోసం గాలింపు చేపట్టారు. ఆమె పూణెలోని ఓ లాడ్జిలో తలదాచుకున్నట్లు పోలీసులు తెలిపారు. కోర్టులో ఆమెను హాజరుపరచగా… రెండు రోజుల పాటు న్యాయస్థానం పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. కోర్టులో మనోరమా ఖేద్కర్ తరఫు న్యాయవాది ఆమెకు ఆయుధాల లైసెన్స్ ఉందని చెప్పారు. దీనికి ప్రభుత్వ న్యాయవాది మాట్లాడుతూ ఆత్మరక్షణ కోసమే తుపాకీ లైసెన్సులు జారీ చేస్తున్నామన్నారు. అంతే తప్ప ఇతరులపై దాడి కోసం కాదని పేర్కొన్నారు.

పూజా ఖేద్కర్‌పై అనేక ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది. ఆమె యొక్క శిక్షణ కార్యక్రమాన్ని నిలిపివేసింది. ఇక కేంద్రం కూడా ఏకసభ్య కమిటీ వేసింది. రెండు వారాల్లో నివేదిక అందజేయనున్నారు. మరోవైపు పూజా అక్రమ కట్టడాలను పూణె మున్సిపల్ అధికారులు కూల్చివేశారు.