Site icon NTV Telugu

Ranya Rao: రన్యారావుతో సంసారం చేయలేను.. విడాకులు తీసుకుంటానన్న జతిన్

Ranyarao

Ranyarao

కన్నడ నటి రన్యారావుతో తెగతెంపులు చేసుకునేందుకు ఆమె భర్త జతిన్ హుక్కేరి రెడీ అయ్యాడు. నాలుగు నెలల క్రితమే ఇద్దరికీ వివాహం అయింది. కానీ ఏనాడూ అతడితో సంసారం చేయలేదు. వ్యాపారాలు పేరుతో విదేశాలకు వెళ్తూ ఉండేదని.. ఒక్క నెల కూడా తనతో సరిగ్గా లేదని ఇటీవల విచారణ సందర్భంగా డీఆర్ఐ అధికారుల ముందు జతిన్ హుక్కేరి వాపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రన్యారావుతో విడాకులు ఇప్పించాలని న్యాయస్థానాన్ని కోరనున్నారు. ఈ మేరకు అతడు న్యాయవాదిని సంప్రదించినట్లు మీడియా సమావేశంలో జతిన్ తెలిపారు.

ఇది కూాడా చదవండి: Illicit Relationship: తల్లి అక్రమ సంబంధాన్ని ప్రశ్నించిన కూతురు.. కేసు పెట్టి వేధించిన కన్న తల్లి

ఒక వివాహ బ్రోకర్‌ ద్వారా 2024, అక్టోబర్ 6న రెస్టారెంట్‌లో రన్యారావు-జతిన్ కలిసి మాట్లాడుకున్నారు. అదే నెల 23న నిశ్చితార్థం జరిగింది. ఇక నవంబర్ 27న వివాహం జరిగింది. ఈ పెళ్లికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు హోంమంత్రి పరమేశ్వర్ హాజరయ్యారు. వీఐపీలంతా ఖరీదైన గిఫ్ట్‌లు ఇచ్చారు. అనంతరం ఖరీదైన ప్లాట్‌లో సంసారాన్ని మొదలుపెట్టారు. నెలలోనే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. మాటిమాటికీ వ్యాపారాలంటూ దుబాయ్ వెళ్తుండేది. చెప్పినా వినకపోవడంతో రన్యారావుకు దూరంగా ఉంటున్నాడు. ఇటీవల డీఆర్ఐ అధికారుల విచారణలో బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో తన ప్రమేయం లేదని జతిన్ తేల్చి చెప్పాడు.

ఇది కూాడా చదవండి: The Paradise : డబ్బులు లేక ‘ప్యారడైజ్’ కు బ్రేక్.. రూమర్లపై స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన టీమ్

మార్చి 3న బెంగళూరు ఎయిర్‌పోర్టులో రూ.12 కోట్ల బంగారంతో రన్యారావు పట్టుబడింది. స్నేహితుడు తరుణ్ రాజుతో కలిసి ఈ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్లు డీఆర్ఐ అధికారులు గుర్తించారు. అనంతరం ఆమె నివాసాన్ని తనిఖీ చేయగా రూ. 3కోట్ల విలువైన ఆభరణాలు, నగదు లభించింది. ఇక ఈ కేసులో రన్యారావు తండ్రి, ఐపీఎస్ అధికారి రామచంద్రరావును ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది. తండ్రి పరపతిని ఉపయోగించుకుని ఎయిర్‌పోర్టులో రన్యారావు వీఐపీ ప్రొటోకాల్‌ ఉపయోగించుకున్నట్లు అధికారులు తేల్చారు.

ఇది కూాడా చదవండి: Exclusive : పాన్ ఇండియా మూవీలో గెస్ట్ రోల్.. రిజెక్ట్‌ చేసిన బాలయ్య

Exit mobile version