Ramdas Athawale: పార్టీ చీలికకు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కారణమని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే ఆరోపించారు. రౌత్ కోరిక మేరకు ఉద్ధవ్ ఠాక్రే ఎన్సీపీతో పొత్తు పెట్టుకున్నారని అన్నారు. శివసేనను విచ్ఛిన్నం చేసింది శరద్ పవార్ కాదని, సంజయ్ రౌత్ కోరిక మేరకు ఉద్ధవ్ ఠాక్రే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో వెళ్లాలని నిర్ణయించుకున్నారని ఆయన వెల్లడించారు. శివసేన, ఎన్సీపీ కలిసి ఉండకపోతే మహారాష్ట్రలో బీజేపీ, శివసేన ప్రభుత్వాలు వచ్చి ఉండేవని కేంద్ర మంత్రి అన్నారు.
శివసేన, ఎన్సీపీ కలిసి ఉండకపోతే మహా వికాస్ అఘాడీ ఎప్పటికీ ఏర్పడి ఉండేది కాదని, అందువల్ల మహారాష్ట్రలో బీజేపీ, శివసేన ప్రభుత్వం ఏర్పడేదని అథవాలే అన్నారు.అంతకుముందు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ శివసేనను విచ్ఛిన్నం చేశారని, పవార్ పార్టీని క్రమపద్ధతిలో బలహీనపరిచారని మహారాష్ట్ర మాజీ మంత్రి రాందాస్ కదమ్ ఆరోపించారు.శివసేన అధినేత కుమారుడు ఎన్సీపీ, కాంగ్రెస్ మంత్రులతో కూర్చోవడం మాకెవరికీ ఆమోదయోగ్యం కాదని, ఏక్‌నాథ్ షిండే ఈ చర్య తీసుకోకుంటే సేనకు 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఉండేవారు కాదని రాందాస్ అథవాలే అన్నారు. 52 ఏళ్లు పార్టీలో పనిచేసి తనను చివరకు పదవి నుంచి తొలగించారని.. ఏకనాథ్ షిండేకు తోడుగా నిలిచిన ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలుపుతానని చెప్పారు.
Govt Jobs: 9.79లక్షల ఉద్యోగాలు ఖాళీ.. పార్లమెంట్‌లో కేంద్రం వెల్లడి
దీనిపై అథవాలే స్పందిస్తూ.. శివసేన ఎన్సీపీతో కలిసి వెళ్లినప్పుడు.. ఇది బాలాసాహెబ్ ఉద్ధవ్ ఠాక్రే నిర్ణయానికి విరుద్ధమని తాను చెప్పినట్లు అథవాలే తెలిపారు. ఒకవేళ ఉద్ధవ్ ఠాక్రే మొదట్లో బీజేపీతో కలిసి వచ్చినట్లయితే ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఉండేవారని అన్నారు. ఏ ప్రతిష్టంభన ఉండేది కాదని రాందాస్ అథవాలే స్పష్టం చేశారు.