NTV Telugu Site icon

PM Modi: రాముడు వివాదం కాదు, పరిష్కారం.. ప్రధాని మోడీ ప్రసంగంలో 10 కీలక వ్యాఖ్యలు..

Pm Modi

Pm Modi

PM Modi: అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం కన్నులపండుగగా జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా “రామ్ లల్లా” విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరయ్యారు. దేశవ్యాప్తంగా వీవీఐపీలు, సాధువులు, సాధారణ భక్తులు ఈ కార్యక్రమానికి వచ్చారు. రామ మందిర ప్రారంభం తర్వాత ప్రధాని నరేంద్రమోడీ భావోద్వేగ ప్రసంగం చేశారు. ఇకపై రామ్ లల్లా టెంట్‌లో ఉండరని, గొప్ప ఆలయంలో ఉంటారని అన్నారు.

Read Also: CM Siddaramaiah: మేము గాంధీ రాముడిని పూజిస్తాం, బీజేపీ రాముడిని కాదు.. కర్ణాటక సీఎం కీలక వ్యాఖ్యలు

ప్రధాని మోడీ ప్రసంగంలోని కీలక వ్యాఖ్యలు:

1) రామ మందిర జాప్యానికి తాను రాముడికి క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. శతాబ్ధాల పాటు మనం చూపిన సహనం, మనం చేసిన త్యాగాల తర్వాత మా రామ్ లల్లా వచ్చారు.

2) జనవరి 22, 2024 కేవలం తేదీ మాత్రమే కాదు, కొత్త శకానికి నాంది. రామమందిర నిర్మాణం ప్రజల్లో కొత్త శక్తిని నింపింది.

3) రామ మందిర నిర్మాణం చేపడితే అగ్ని జ్వాలలు చెలరేగుతుందని అన్నారు, రాముడు అగ్ని కాదు శక్తి. రాముడు వివాదం కాదు, పరిష్కారం.

4) మనం ఇప్పుడు రాబోయే 1000 ఏళ్ల భారతదేశానికి పునాది వేయాలి. ఈ క్షణం నుంచి సమర్థవంతమైన, గొప్ప, దైవిక భారతదేశానన్ని నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము.

5) రామ మందిరం నిర్మాణం భారతీయ సమాజ పరిపక్వతకు ప్రతిబింబం. ఇది కేవలం విజయానికి మాత్రమే కాదు, వినయానికి కూడా ఒక సందర్భం.

6) రాముడి ఉనికి ప్రశ్నార్థంగా మారింది. న్యాయం చేసినందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. చట్టానికి అనుగుణంగా ఆలయాన్ని నిర్మించారు.

7) రామ్ లల్లా ఇప్పుడు టెంట్‌లో ఉండరు.. గ్రాండ్ టెంపుల్‌లో ఉంటారు.

8) సాగర్ నుంచి సరయు వరకు ప్రయాణించే అవకాశం నాకు లభించింది. సాగరం నుంచి సరయు వరకు రామనామ వినిపిస్తోంది. పండగ స్పూర్తి కనిపిస్తోంది.

9) జనవరి 22, 2024 క్యాలెండర్లో తేదీ మాత్రమే కాదు, ఇది కొత్త కాలచక్రానికి మూలం

10) రామ మందిరం ఇంత ఆలస్యంపై రాముడికి క్షమాపణలు చెబుతున్నా. ఇన్ని రోజులు రాముడికి, ప్రజలకు మధ్య దూరం, ఈ రోజుతో ముగిసింది.