Rahul Gandhi: రామమందిర ప్రారంభోత్సవాన్ని ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీపై కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామమందిర కార్యక్రమం ‘మోడీ ఫంక్షన్’గా అభివర్ణించారు. జనవరి 22న తేదీని బీజేపీ, ఆర్ఎస్ఎస్ పూర్తిగా నరేంద్రమోడీ కార్యక్రమంగా మార్చాయని, ఇడి బీజేపీ/ఆర్ఎస్ఎస్ ఫంక్షన్ అని మండిపడ్డారు. అందుకే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రెసిడెంట్ వెళ్లనని చెప్పారని అన్నారు.
Read Also: Hyderabad Crime: గాలిపటం ఎగురవేస్తూ యువకుడి బలి.. ఆరుగురు స్నేహితులపై అనుమానం
మేము అన్ని అన్ని మతాలను, ఆచారాలను గౌరవిస్తామని, హిందూ మత పెద్దలు, హిందూ మతానికి సంబంధించిన వ్యక్తులు కూడా జనవరి 22 రామ మందిర వేడుకలకు వెళ్లడంపై ఏమనుకుంటున్నారో వారి అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పారు. ఇది రాజకీయ కార్యక్రమం అని రాహుల్ గాంధీ అని అన్నారు. దీంతోనే ప్రధాని నరేంద్రమోడీ చుట్టూ రూపొందించిన ఈ రాజకీయ కార్యక్రమానికి వెళ్లడం మాకు ఇష్టం లేదు అని అన్నారు.
అంతకుముందు రామాలయ వేడుకకు జనవరి 22న హాజరుకావాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, అధిర్ రంజన్ చౌదరిలకు అయోధ్య రామమందిర ట్రస్ట్ ఆహ్వానం పంపింది. ఇది పూర్తిగా ఆర్ఎస్ఎస్/బీజేపీ సొంత కార్యక్రమమని దీనికి హాజరు కాబోవడం లేదని కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది. దీనిపై బీజేపీ విమర్శలు చేస్తోంది.
జనవరి 22న అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవ వేడుల జరగనుంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 7000 మంది ప్రముఖులకు ఆహ్వానాాలు అందాయి. దీంతో పాటు లక్షలాది మంది ప్రజలు ఈ వేడుకకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ వేడుక నేపథ్యంలో అయోధ్యలో పండగ వాతావరణం నెలకొంది. యూపీ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది.