NTV Telugu Site icon

Farooq Abdullah: రాముడు హిందువులకు మాత్రమే దేవుడు కాదు.. అందరివాడు..

Farooq Abdullah

Farooq Abdullah

Farooq Abdullah: అధికారంలో ఉండేందుకు శ్రీ రాముడి పేరును బీజేపీ ఉపయోగిస్తోందని, అయితే రాముడు హిందువులకు మాత్రమే దేవుడు కాదని అందరికి దేవుడే అని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, ఎన్‌సి చీఫ్ డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా అన్నారు. భగవాన్ రామ్ ప్రతి ఒక్కరికీ దేవుడు, ముస్లిం-క్రిస్టియన్, అమెరికన్, రష్యన్ ఇలా అతడిపై విశ్వాసం ఉన్నవారు చాలా మంది ఉన్నారని ఆయన అన్నారు.

Read Also: Asia Cup : పాక్ లోనే ఆసియా కప్.. విదేశాల్లో మాత్రం టీమిండియా మ్యాచ్ లు..!

మేము రాముడి శిష్యులం, భక్తులం అని మీ వద్దకు వచ్చే వారు మూర్ఖులని పరోక్షంగా బీజేపీని విమర్శించారు. రాముడి పేరుతో అమ్ముడుపోవాలనుకుంటున్నారని, వారికి రాముడిపై ప్రేమ లేదు, అధికారంపై ప్రేమ మాత్రమే ఉండంటూ దుయ్యబట్టారు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికలను ప్రకటించే సమయానికి ప్రజల దృష్టి మరల్చడానికి రామ మందిరాన్ని ప్రారంభిస్తారని భావిస్తున్నానని అన్నారు.

విపక్షాల ఐక్యత గురించి మాట్లాడుతూ.. బీజేపీయేతర విపక్షాల ఐక్యతకు ఎటువంటి అడ్డంకులు ఉండవని, అది కాంగ్రెస్, ఎన్సీ, ఏ పార్టీ అయిన కావచ్చు ప్రజల కోసమ పోరాడుతాం, ప్రజల కోసం మరణించేందుకు సిద్ధం అని ఆయన అన్నారు. మేమంతా ఐక్యంగా ఉంటామని స్పష్టం చేశారు. ఈవీఎం వినియోగంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు ముందు మత ధ్రువీకరణకు వ్యతిరేకంగా ప్రజలు హెచ్చరించారు ఫరూఖ్ అబ్దుల్లా. ఎన్నికల సమయంలో హిందువులను ఎక్కువగా వాడుకుంటారని, వారు ప్రమాదంలో ఉన్నారని హెచ్చరించారు.