భారత్‌పై ట్రంప్ విధించిన 50 శాతం సుంకం అమల్లోకి వచ్చాయి. ఇక భారత్-అమెరికా మధ్య కూడా సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. సుంకాలు కారణంగా రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. రైతుల కోసం ఎంత భారమైనా భరిస్తామని ప్రధాని మోడీ ఇప్పటికే ప్రకటించారు.
ఇది కూడా చదవండి: US: ట్రంప్‌ను చంపేయండి.. విద్యార్థులపై కాల్పులు జరిపిన నిందితుడి తుపాకీపై రాతలు
ఇక తాజాగా ట్రంప్ సుంకాలపై రాజ్యసభ ఎంపీ, మక్కల్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. ఈ సందర్భంగా భారత్‌కు పలు సూచనలు చేశారు. భారత ఎగుమతులుపై రాయితీలు ఇస్తే బాగుంటుందని తెలిపారు. ఇక రాజకీయ కుట్రలో భాగంగానే ట్రంప్ 50 శాతం సుంకం విధించారని తెలిపారు. అంతే తప్ప ఉక్రెయిన్ యుద్ధం గురించి కాదన్నారు. భారతీయ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు ఈ కుట్రగా అభివర్ణించారు. భారతీయ సార్వభౌమత్వాన్ని సవాల్ చేస్తున్నప్పుడు దేశమంతా కలిసి పని చేయాలని కోరారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ ఉపశమనం కలిగించే మార్గాలను అన్వేషించాలని తెలిపారు.
ఇది కూడా చదవండి: US: అలాస్కాలో కూలిన ఎఫ్-35 జెట్ విమానం.. భారీగా ఎగిసిపడ్డ మంటలు
భారత ఎగుమతిదారులకు ఉపశమనం కల్పించడానికి ఎంఎస్ఎంఈ రుణ చెల్లింపులపై రెండేళ్ల పాటు మారటోరియం, ప్రత్యేక అత్యవసర క్రిడెట్ అందిస్తే బాగుంటుందన్నారు. ఇక పెండింగ్‌లో ఉన్న జీఎస్టీ, RODTEP, RoSCTL వాపసులను గడువులోపు క్లియర్ చేయాలని సూచించారు. తిరుప్పూర్, సూరత్, నోయిడాలోని ఎగుమతిదారులకు, ఆంధ్రప్రదేశ్‌లోని రొయ్యల రైతులకు, గుజరాత్, మహారాష్ట్రలో రత్నాలు, ఆభరణాల పరిశ్రమకు, ఉక్కు కార్మికులకు కమల్‌హాసన్ సంఘీభావం తెలిపారు. వారంతా ‘‘భౌగోళిక రాజకీయ క్రీడల ఖర్చును భరించకూడదు’’ అని అన్నారు.
