Site icon NTV Telugu

Rajya Sabha Elections: షెడ్యూల్ విడుదల.. 6 రాష్ట్రాల్లో 13 స్థానాలకు ఎన్నికలు

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఇవాళ్టితో ముగిసింది.. మరో మూడు రోజుల్లో ఫలితాలు రాబోతున్నాయి.. ఇదే సమయంలో మరో ఎన్నికలకు సిద్ధం అవుతోంది కేంద్ర ఎన్నికల సంఘం.. ఆరు రాష్ట్రాల్లోని 13 స్థానాలకు ఎన్నికలకు జరగనుండగా.. ఇవాళ షెడ్యూల్‌ విడుదల చేసింది.. అస్సాంలో 2, హిమాచల్ ప్రదేశ్ లో 1, కేరళలో 3, నాగాలాండ్ లో 1, త్రిపురలో 1, పంజాబ్‌లో 5 రాజ్యసభ స్థానాలు.. ఇలా మొత్తం 13 రాజ్యసభ స్థానాలు ఏప్రిల్‌లో ఖాళీ కానున్న నేపథ్యంలో షెడ్యూల్ విడుదల చేసింది.. మార్చి 21న నోటిఫికేషన్‌ జారీ కానుండా… 21 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుంది.. మార్చి 24న నామినేషన్ విత్ డ్రాకు గడువు ఉంది. ఇక, మార్చి 31న పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు జరుగనుంది.

Read Also: YS Sharmila New Party: ఏపీలో షర్మిల కొత్త పార్టీ..? 13 జిల్లాల నేతలతో కీలక భేటీ..

Exit mobile version